దుమ్ము దులుపుతోన్న కేజీయఫ్ టీజర్.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన యష్..

0
264
Spread the love

కన్నడ సినిమా కేజీయఫ్‌ను మొదట ఓ ప్రాంతీయ చిత్రంగా భావించారు. అంతేకాదు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది ఈ సినిమా. కానీ 2018 వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ను ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆ సినిమాలో పాటలు, ఫైట్స్, డైలాగులు ఓ రేంజ్‌లో పేలాయి. రిరీకార్డింగ్ అయితే ఇక అది మరో రేంజ్. ప్రజలు విరగబడి చూశారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ యువ హీరో యష్ ప్రధాన వచ్చిన ఈ సినిమా ఇటూ మాస్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషాల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించింది. దీంతో అదే ఊపు మీదున్న చిత్రబృందం ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా కేజీయఫ్ 2తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాప్టర్ 2 కి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా యష్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను వదిలింది. ఈ టీజర్ కూడా మామూలుగా పేలలేదు. టీజర్‌లో డైలాగులు, సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

దీంతో కేజీయఫ్ టీజర్ యూట్యూబ్‌లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్‌కు విపరీతంగా లైక్స్ వస్తున్నాయి. పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా టీజర్ ను మేకర్స్ యష్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే విడుదల చేసారు. యష్ ఈరోజు తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

ఈ టీజర్‌ను రాత్రి 9 గంటల 29 నిమిషాల సమయంలో విడుదల చేసింది చిత్రబృందం. కేవలం 79 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ కొల్లగొట్టేసి ఏకంగా వరల్డ్ రికార్డ్ నే సెట్ చేసినట్టు సమాచారం. పది గంటల వ్యవధిలోనే 15 మిలియన్స్ వ్యూస్‌తో కేకపెట్టిస్తోంది టీజర్. మరోవైపు 1.8 మిలియన్ లైక్స్ తో మరో సెన్సేషనల్ రికార్డులను ఈ టీజర్ తన ఖాతాలో వేసుకుంది.

కేజీయఫ్ టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు జనాలు. ఇండియాలోనే ఏ సినిమాకు ఇవ్వని రేంజ్ రెస్పాన్స్ ఇప్పుడు కేజీయఫ్ చాప్టర్ 2 కి వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల విషయానికి వస్తే.. యష్‌తో పాటు మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధిరా లుక్‌లో అదరగొడుతున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఓ పవన్ ఫుల్ ఉమెన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలకపాత్రలో కనిపించనున్నారు. సంగీతం రవి బసరూర్ అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here