కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

0
213
Spread the love

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 పడకల కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని సోమవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కిడ్నీ పేషెంట్ లు డయాలసిస్ కోసం హైదరాబాద్ లాంటి మహా నగరాలకు వెళ్లే వారని ఇప్పుఫు మన నిర్మల్ లోనే అత్యాధునిక సదుపాయాలతో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నామని పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటి డయాలసిస్ సెంటర్ ను నిర్మల్ లోనే ఏర్పాటు చేసుకున్నామని ఒక్క రోజుకు 40 మంది కిడ్నీ పేషెంట్ లకు ఒక రూపాయి ఖర్చు లేకుండా డయాలసిస్ చేయొచ్చని పేషెంట్ కి వాడిన పరికరాలను రీ సైక్లింగ్ చేయకుండా డిస్పోసల్ పరికరాలను వాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారని మంత్రి అన్నారు..ఆసుపత్రికి మిషన్ భగీరథ వాటర్ ను సప్లై చేస్తున్నామని రూ.20 కోట్లతో ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని 20 కోట్లతో MCH ఆసుపత్రికిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు త్వరలోనే ధర్మసాగర్ నుండి ఆసుపత్రికి డబుల్ రోడ్డు వేస్తామని ఏరియా ఆసుపత్రిలో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేసిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి కుమారుడు డాక్టర్ రఘు నందన్ రెడ్డి గారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు ప్రయివేట్ ఆసుపత్రిలో రూ4లక్షల ఖర్చు అయ్యే సర్జరీ ని పూర్తి ఉచితంగా మన నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారన్నారు..అనంతరం కరోనా లాక్ డౌన్ సమయంలో సేవలు చేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లను మంత్రి పంపిణి చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here