మహిళలకు హైజినిక్ కిట్లు పంపిణి

0
110
Spread the love

మహిళలకు హైజినిక్ కిట్లు పంపిణి

మహిళలకు హైజినిక్ కిట్లు పంపిణి చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మహిళా రక్షణ కుటుంబానికి సంరక్షణ అనే నినాదం తో అనే కార్యక్రమం పేరుతో …. సెంట్రల్ హైదరాబాద్ బీజేపీ మహిళా మోర్చా ఆద్వర్యం లో ….. నరేంద్రమోడీ పరిపాలనా 7 పూర్తి అయిన సందర్భంగా సేవ హి సంఘటన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… మహిళ‌లు ఆరోగ్యాంగా ఉంటే కుటుంబం ఆరోగ్యం గా ఉంటుందని, ప్రతి మహిళా ఆరోగ్యాంగా ఉండాలని కేంద్రమంత్రి గంగవరపు కిషన్ రెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు. సేవ హి సంఘటన కార్యక్రమం లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరిపాలన 7 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా, కిషన్ రెడ్డి కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా సెంట్రల్ హైదరాబాద్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గారపాటి అనంతలక్ష్మి ఆద్వర్యం లో నాలుగు నియోజకవర్గాలలో 24 డివిజన్ లో మహిళలకు కేంద్రమంత్రి గంగవరపు కిషన్ రెడ్డి చే మహిళలకు హైజినిక్ కిట్లు ఆదివారం అందించడం జరిగింది. ఈ కోవిడ్‌ సమయం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యాంగా వున్నప్పుడే వ్యాధి ఎం చెయ్యలేదని, ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని కిషన్ రెడ్డి సూచించారు. సెంట్రల్ హైదరాబాద్ బీజేపీ మహిళా మోర్చా కార్యక్రమాలు అభినందనీయమని మహిళా ఆరోగ్యంగా ఉండాలని సెంట్రల్ హైదరాబాద్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గారపాటి అనంతలక్ష్మి ఆద్వర్యం లో 24 డివిజన్ మహిళలకు హైజినిక్ కిట్స్ అందించడం అభినందనీయమన్నారు. బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం ఇంచార్జ్, మాజీ ఎం.ఎల్.ఏ చింతల రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ మహిళా విభాగం అందిస్తున్న హైజినిక్ కిట్స్ లో హెల్త్ సప్లమెంట్స్ మల్టీవిటమిన్స్. విటమిన్స్, విటమిన్ సి, మాస్క్లు, శానిటైజర్, విమెన్ సానిటరీ నేప్కిన్ కిట్ గా ఏర్పాటు చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అదేక్షులు డా.గౌతంరావు మాట్లాడుతూ ఈ సమయం లో అందరూ జాగ్రత్త గా ఉండాలని, మహిళా మోర్చా సేవలు అభినందనీయమన్నారు. సెంట్రల్ హైదరాబాద్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గారపాటి అనంతలక్ష్మి మాట్లాడుతూ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఛాయాదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here