సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా కిష‌న్‌ రెడ్డి బాధ్య‌త‌లు స్వీకరణ

0
131
Spread the love

సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా కిష‌న్‌ రెడ్డి బాధ్య‌త‌లు స్వీకరణ

న్యూఢిల్లీ జూలై 8 (ఎక్స్ ప్రెస్ న్యూస్ తెలంగాణ‌కు చెందిన జీ కిష‌న్‌ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెప్పారు. ప‌ర్యాట‌క‌శాఖ స‌హాయ మంత్రి అజ‌య్ భ‌ట్‌, శ్రీపాద నాయ‌క్‌, మీనాక్షి లేఖి కూడా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ స‌హాయ మంత్రిగా రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. న్యాయ‌శాఖ మంత్రిగా కిర‌ణ్ రిజిజు, రైల్వే స‌హాయ మంత్రిగా ద‌న్వే రావుసాహెబ్ దాదారావు, ఆరోగ్య‌శాఖ స‌హాయ‌మంత్రిగా డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్‌, రైల్వేశాఖ స‌హాయ మంత్రిగా ద‌ర్శ‌న్ విక్ర‌మ్ జ‌ర్దోష్‌, ప‌ర్యావ‌ర‌ణ‌, కార్మిక‌శాఖ‌ మంత్రిగా భూపేంద్ర యాద‌వ్‌లు బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here