కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ నియామకం 

0
482
Spread the love

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ నియామకం 

న్యూఢిల్లీ జూన్ 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీ ఉత్తర్వులిచ్చింది. ఎంపీ సింగ్‌  ఇటీవల వరకు ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్‌ ఆర్గనైజేషన్‌) సీఈవోగా పనిచేయగా.. జూన్‌ 1న ఆయనకు అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించింది. ఎంïపీ సింగ్‌ సర్థార్‌ సరోవర్‌ కన్‌స్ట్రక్షన్‌ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఎస్‌సీఏసీ) చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేసిన పరమేశం మే 31న పదవీ విరమణ చేశారు.అప్పటి నుంచి గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ కేఆర్‌ఎంబీ ఇన్‌చార్జి చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ (గ్రూప్‌ఏ) సర్వీసెస్‌ (సీడబ్ల్యూఈఎస్‌) హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ (హెచ్‌ఏజీ)గా పదోన్నతి పొందిన ఎంపీ సింగ్‌ను సీడబ్ల్యూఎస్‌ హెచ్‌ఏజీగా పరిగణిస్తూ.. ఈ నెల 1 నుంచి బాధ్యతలు స్వీకరించే వరకు జీతభత్యాలు కేఆర్‌ఎంబీ చెల్లించాలని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here