కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
91
Spread the love

కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ జూన్ 25 (రెక్స్ ప్రెస్ న్యూస్ );: న‌గ‌రంలోని వెంగ‌ళ్రావు న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన‌ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.ఈ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం కంటే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. శాంతి కోసం ఎంత శ్ర‌మిస్తే.. యుద్ధంలో అంత త‌క్కువ ర‌క్తాన్ని చిందిస్తాము అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను అత్యాధునిక స‌దుపాయాల‌తో ఏర్పాటు చేశామ‌న్నారు. దీని ద్వారా క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను, క‌రోనా ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను పూర్తిగా అరిక‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here