నగరంలో దశల వారీగా అభివృద్ధి పనులు – మంత్రి కె.టి.ఆర్

0
49
Spread the love
 
*రూ. 86 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్.ఓ.బి ని ప్రారంభించిన మంత్రి కేటిఆర్*
 
 
*హైదరాబాద్, జూన్ 21:*    నగరంలో ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. 
 

కూకట్ పల్లి నియోజకవర్గంలో రూ. 86 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్ ఓ బి నీ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు, శాసన మండలి సభ్యులు సురభి వాణీ దేవి, శంభిపూర్ రాజు, నవీన్ రావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ లు సాయి చంద్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
 

ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ…  మెరుగైన రవాణా వసతులు కల్పించేందుకు ఎల్బి నగర్ నుండి కూకట్ పల్లి – ఉప్పల్ నుండి శేరిలింగంపల్లి వరకు అండర్ పాసులు, ఆర్ ఓ బి లు,  ఫ్లైఓవర్ లు మొదటి దశ లో ఎస్ ఆర్ డి పి ద్వారా  రూ. 8052 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టినట్లు ఇప్పటి వరకు 30  పనులు పూర్తి కాగా మిగతావి వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని, అట్టి పనులు వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేస్తామన్నారు. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ప్రజలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండో దశలో రూ. 3115 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు.
 

 అభివృద్ధి చెందిన దేశాలలో నగరం అభివృద్ధి కి రహదారులు చేపట్టి ప్రజా రవాణా వ్యవస్థను కలిగి ఉండాలి అన్నారు. 
 ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కేసిఆర్ ఆదేశాల మేరకు ఎస్ ఆర్ డి పి  పథకం అమలు చేసినట్లు తెలిపారు. అర్హులను మిస్ కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గత ప్రభుత్వ హయాంలో 29 లక్షల మందికి  పింఛన్లు ఇస్తే ఈ ప్రభుత్వ హయాంలో 40 లక్షల మందికి 10 రేట్లు పెంచి 2000 రూపాయల చొప్పున  ఆసరా పింఛన్లు విభిన్న ప్రతిభావంతులకు  ఆరు రేట్ల చొప్పున 3000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు గత ప్రభుత్వ హయాంలో అన్ని పింఛన్లు 800 కోట్లు అయితే  ప్రస్తుతం 10వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ భూముల్లో ప్రజల సౌకర్యం కోసం ప్రాజెక్ట్ లు చేపడితే కేసులు పెట్టాలని మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అంటున్నారని, ఇంజనీర్లు కార్మికుల మీద పోలీసు కేసులు పెట్టండని చెప్తున్నారని, దమ్ముంటే మున్సిపల్ శాఖ మంత్రి నైన నా పై కేసు పెట్టాలని అన్నారు. వరదల వలన ఇబ్బందులు లేకుండా ఎస్.ఎన్.డి.పి ద్వారా వెయ్యి కోట్లతో పనులను చేపడుతున్నామని, రెండో దశ పనులు కూడా చేపట్టి వరద నివారణకు శాశ్వత పరిష్కారం చేస్తామని అన్నారు. నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పూర్తి సహకారం అందిస్తామని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించడం జరుగుతుందని, అందుకు ప్రజలు నాలా పనులు పూర్తి అయ్యేందుకు సహకరించాలని కోరారు. 
 
         57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు త్వరలో పంపిణీ చేస్తామని, రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన వారికి పారదర్శకంగా అందించేందుకు త్వరలో చర్యలు చేపట్టడం జరుగుతుందని, అందరి సమక్షంలో లక్కీ డ్రా తీసి లబ్దిదారులకు అందజేస్తామని అన్నారు.  కేంద్రం సహకరించినా సహకరించకపోయినా సుచిత్ర వద్ద ప్రాజెక్టు పనులు చేపడతామని తెలిపారు. ఐడిపిఎల్ చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకుంటామని, మూసాపేట లో హౌసింగ్ స్కీం కోసం స్థలం కేటాయించడం జరుగుతుందని చెప్పారు.  
 
   కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని, గుజరాత్ లో అభివృద్ధి కోసం వేల కోట్లు మంజూరు చేస్తున్నదని అన్నారు. ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చడం లేదు అన్నారు. 
 
 
ఈ సమావేశంలో సి.ఇ ప్రాజెక్ట్ దేవానంద్, జోనల్ కమిషనర్ మమత, ఎస్.ఇ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here