తుకారాం రైల్వే గేట్ రోడ్డు అండర్ బ్రిడ్జి ని ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్

0
73
Spread the love

రూ. 72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తుకారాం రైల్వే గేట్  రోడ్డు అండర్ బ్రిడ్జి ని ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్


హైదరాబాద్, మార్చి 04:  
వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటి వరకు 6 వేల కోట్ల రూపాయల వ్యయంతో పనులను పూర్తి  చేసినట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.  
రూ. 72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తుకారాం రైల్వే గేట్ రోడ్డు అండర్ బ్రిడ్జి ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ లతో కలిసి మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ… శతాబ్ద కాలం నుండి తుకారాం గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు. ఆర్ యు బి  అందుబాటులోకి రావడంతో ప్రజలకు రవాణా ఇక్కట్లు తొలిగిపోతాయన్నారు.  సిగ్నల్ ఫ్రీ నగరంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే అండర్ పాసులు, ఫ్లైఓవర్ లు, ఆర్ ఓ బి లను చేపట్టి ప్రజల ట్రాఫిక్ సమస్యలు అధిగమించడం జరిగిందని చెప్పారు. నగరంలో  సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్ నగర్  నియోజకవర్గంలో  రైల్వే లైన్ ఉన్నందున ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ఉన్న వాటిని  నెరవేర్చేందుకు అవసరమైన చోట అండర్ పాసులు, ఫ్లై ఓవర్లు, ఆర్  ఓ బి లను చేపట్టేందుకు ఇటీవల రైల్వే ఉన్నతాధికారులతో పిలిపించి చర్చించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను  ఇప్పటికే చేపట్టినట్లు మంత్రి కే టి ఆర్  అన్నారు. డిప్యూటీ స్పీకర్  టి పద్మారావు మాట్లాడుతూ…  తుకారాం రైల్వే గేట్ వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రజల చిరకాల వాంఛగా ఉండేదని, డైనమిక్ మంత్రి వర్యులు కే టి ఆర్ గారి సారథ్యంలో ప్రజల వాంఛ నెరవేరిందని ఉద్యమ కాలంలో కూడా ట్రాఫిక్ దిగ్బంధం లో చిక్కుకున్నామని, అడ్డ గుట్ట యువత సహకారం వలన  తిరిగి అక్కడ నుండి గమ్యస్థానానికి చేరుకున్నట్లు వివరించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దళిత అభ్యున్నతి కోసం దళిత బంధు అమలు చేస్తున్నారని మార్చి, ఏప్రిల్ మాసంలో అధిక మొత్తంలో ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ  అండర్ బ్రిడ్జి వలన మల్కాజిగిరి, మారెడ్ పల్లి, మెట్టుగూడ, లాలాపేట్  ట్రాఫిక్ రద్దీ తగ్గిస్తుందని అంతే కాకుండా మౌలాలి, మల్కాజిగిరి, తార్నాక  సికింద్రాబాద్  వైపు వెళ్లేందుకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు హేమ, శైలజ, సునీత, ప్రసన్న ,ఎస్.అర్.డి.పి  సి ఈ దేవానంద్, ఎస్.ఈ రవీందర్ రాజు, ఇ ఇ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here