రూ.3500 కోట్ల వ్యయంతో సీవరేజ్ డ్రైనేజి ఆధునీక‌ర‌ణ‌ పనులు – మంత్రి కేటీఆర్

0
138
Spread the love

రూ.3500 కోట్ల వ్యయంతో సీవరేజ్ డ్రైనేజి ఆధునీక‌ర‌ణ‌ పనులు – మంత్రి కేటీఆర్

హైదరాబాద్, మే 5 :: జీహెచ్ఎంసి లో విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో రూ. 3500 కోట్ల వ్యయంతో డ్రైనేజి, సీవరేజ్ ఆధునీకరణ పనులను చేపడుతున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాకా మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. కూకట్పల్లి నియోజకపరిధిలో నేడు దాదాపు రూ 71 .49 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కైతలాపుర్ లో వీడీసీసీ రోడ్డు నిర్మాణపనులు ప్రారంభించిన సందర్బంగా మంత్రి స్థానికులతో మాట్లాడారు. గత టర్మ్ లో ఏవిధంగానైతే రూ. 3000 కోట్ల తో శివారు ప్రాంతాలకు తాగునీటిని అందించి నీటి కొరత లేకుండా చేసామో అదేవిధంగా ఈ టర్మ్ లో రూ 3500 కోట్ల వ్యయంతో శివారు ప్రాంతాలలో డ్రైనేజి, సీవరేజ్ ఆధునీకరణ పనులను చేపడున్నట్టు తెలియచేసారు. నగరంలో వర్షాల వల్ల తిరిగి కాలనీలు, బస్తీలు ముంపుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. కైతలాపుర్ లోని ట్రాన్స్ఫర్ స్టేషన్ ను ఆధునీకరించడంద్వారా స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని హామీనిచ్చారు. కరోనా పూర్తిగా పోలేదు, మరోసారి లాక్ డౌన్ రావద్దంటే మాస్కలు తప్పనిసరిగా ధరించాలని నగర పౌరులకు కేటీ రామా రావు విజ్ఞప్తి చేశారు. కైతలాపుర్ లో గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన గృహాలకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు..

* రూ. 66 .59 కోట్ల వ్యయం తో నిర్మించిన ఆర్.యూ.బి ప్రారంభం*

హైటెక్-సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.66.59 కోట్ల తో నిర్మించిన ఆర్.యు.బి ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామా రావు ప్రారంభించారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20 .60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్.యూ.బి ప్రారంభంతో తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హై-టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషన్ మార్గంలో ఏవిధమైన అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది. హై -టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం కావడం ఈ ప్రాంత వాసులకు మరింత వెసులుబాటు అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్షి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, డిప్యుటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here