బీజేపీకి కేటీఆర్‌ వినతి. ఎన్నికల తర్వాత కలసి పనిచేద్దాం

0
232
Spread the love

బీజేపీకి కేటీఆర్‌ వినతి. ఎన్నికల తర్వాత కలసి పనిచేద్దాం

జీహెచ్ఎంసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… పండుగ వాతావరణంలో లంబడి తండాలో డబుల్ బెడ్ రూం లు అడబిడ్డలకు ఇవ్వడం సంతోషంగా ఉందని. 18 వేల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 28 రాష్ట్రాలలో ఎక్కడ ఇలా ఇల్లు ఇవ్వడం లేదని.. విలువైన ఇళ్ళు ఇవాళ ప్రజల చేతికి అందిస్తున్నామని పేర్కొన్నారు. 40-50 లక్షల విలువ మార్కెట్ లో ఉంటుందని. అటువంటి డబుల్ బెడ్ రూమ్ లు లబ్దిదారులకు ఇస్తున్నామని తెలిపారు. ఇట్టి ఇండ్లు కిరాయికి ఇవ్వవద్దు,అమ్మవద్దు , ఒక వేళ అలా చేస్తే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. హైదరాబాద్ లో లక్ష బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తుందని తెలిపారు.

అలాగే ఈ సందర్భంగా బీజేపీకి కేటీఆర్‌ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అప్పడు పోటీ పడదామని… ఎవరి వాదనలు వారు గట్టిగా చెప్పుకుందామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని…హుందాగా రాజకీయాలు చేద్దామన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here