పాతబస్తీ కొత్తబస్తీ కి తేడా లేకుండా అభివృద్ధికి కృషి – మంత్రి కేటీఆర్

0
50
Spread the love
పాతబస్తీ కొత్తబస్తీ కి తేడా లేకుండా అభివృద్ధికి కృషి – మంత్రి కేటీఆర్
 
 
 *హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రూ. 580 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు*
 
 
*హైదరాబాద్, ఏప్రిల్ 19:*   పాత బస్తీ కొత్త బస్తీకి తేడా లేకుండా సమానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర  పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం పాత బస్తీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు రూ. 580 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిష్టర్ అసద్ ఉద్దీన్ ఓవైసీ, శాసన మండలి సభ్యులు ఎం.ఎస్ ప్రభాకర్, రియాజుద్దీన్ హస్సన్, శ్రీమతి వాణి దేవి, చార్మినార్, బహదూర్ పుర శాసనసభ సభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్, మహ్మద్ మోజాం ఖాన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోయినుద్దీన్,  జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 
 
 ఈ సందర్భంగా సర్దార్ మహల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పాత బస్తీ లో ఉన్న వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందించే నేపథ్యంలో ముందుగా మోజం జాహి మార్కెట్ ను అద్భుతంగా పునరుద్దరణ చేయడం జరిగిందని అదే విధంగా పురాతన చారిత్రక కట్టడాల వారసత్వ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.   కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు చారిత్రక  కట్టడాల పునరుద్దరణ, ఇన్నోవేషన్ పనుల ను కేటాయించినట్లు తెలిపారు. వారసత్వ సంపద అయిన సర్దార్ మహల్ ను కల్చరల్ హబ్ గా తయారు చేస్తామన్నారు. పర్యాటకులు ఆకర్షించే విధంగా ఒక మ్యూజియం, 12 గదులు గల హోటల్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవ మరుసటి రోజు పురాతన హెరిటేజ్ భవనాల పునరుద్దరణకు శంకుస్థాపన  చేయడం  ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, జిహెచ్ఎంసి గాని,  అసెంబ్లీ ఎన్నికలు గాని  లేవు ఏ ఎన్నికలు లేకపోయినా ఎన్నికలు దృష్టిలో పెట్టుకోకుండా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రూ. 500 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టడం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కమిట్మెంట్ కు నిదర్శనమని అన్నారు.
 
పాత బస్తీలో  శానిటేషన్ మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 300 స్వచ్ఛ ఆటోలను ఇవ్వగా అదనంగా మరో 150 స్వచ్ఛ ఆటోలను కేటాయింపు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో త్రాగు నీటి విద్యుత్ సరఫరా సమస్య లేదని. దేశంలో గల మెట్రో  నగరంలో సమస్య ఎదుర్కుంటున్నారు తప్ప హైదరాబాద్ సిటీలో లేదన్నారు. నగరంలో  మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు 437  ఏళ్ల వారసత్వ సంపదను  కాపాడుకుంటున్నామన్నారు. హైదరాబాద్ నగరం పాత బస్తీతో పాటు  జిహెచ్ఎంసి పరిధిలో  నోటరీ తో ఉన్న  ప్రాపర్టీ  పై హక్కు కల్పిస్తామన్నారు. ఇది ప్రభుత్వ  పరిశీలనలో ఉందని  గౌ.ముఖ్య మంత్రి గారి  ద్రుష్టి కి తెచ్చి పరిష్కారం చేస్తామన్నారు  గతంలో ప్రభుత్వం జి ఓ 58,59 ప్రకారంగా ఒక లక్ష  మందికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. 
 
ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధి కి  అసెంబ్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ను ఆదేశించడం జరిగిందని ఈ ఆసుపత్రి వలన హైదరాబాద్ వాసులకే కాకుండా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాకు చెందిన వారికి వైద్య సేవలు అందుబాటులోకి  వస్తాయన్నారు. హైదరాబాద్ తో పాటుగా ఇతర జిల్లా లో కూడా ఆరోగ్య సేవలను అందించేందుకు  వైద్య ఆరోగ్య శాఖ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బహదూర్ పుర  ఫ్లైఓవర్ కు  ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టాలని గౌ. ఎం.అసద్ ఉద్దీన్ కోరిన నేపథ్యంలో తప్పకుండా  ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టడం జరుగుతున్నదని  ప్రముఖ వ్యక్తుల సేవలు భావితరాల వారు స్మరించుకునే అవకాశం ఉంటుంది అన్నారు. పాత నగరంతో పాటు కొత్త నగరంలో అవసరమైన చోట ఫ్లైఓవర్ లను నిర్మాణం చేస్తామన్నారు. మిరాలం మండి అద్వాన స్థితిలో ఉందని తిరిగి పునర్ నిర్మాణం, అదేవిధంగా మహబూబ్ చౌక్  వద్ద క్లాక్ టవర్ నిర్మాణం చేశామని అక్కడ గల ముర్గి చౌక్ పునరుద్దరణ  పనులు అదే విధంగా మీర్ అలాం చెరువులో ఈ ప్రాంత ప్రజలకు కనువిందు చేసేందుకు మ్యూజికల్ ఫౌంటెన్  ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఆరాంఘర్ నుండి జూ పార్క్ గల అతి పెద్ద రెండో ఫ్లైఓవర్  పనులు వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలు, మతాల తో చిచ్చుపెట్టి చిల్లర రాజకీయాలు చేయలేదని, చిన్నప్పుడు నేను గ్రామర్ స్కూల్ లో చదివినప్పుడు ఏదో ఒక పంచాయితీ తో కర్ఫ్యూ విధించేవారని, ఇప్పుడు సీఎం నాయకత్వంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని, విధ్వంస శక్తులపై కన్నేసి ఉంచాలని అన్నారు. 
 
హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… గతంలో పాలించిన ప్రభుత్వాలు పాత బస్తీ అభివృద్ధి పట్టించుకోలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీ అభివృద్ధికి పెద్దపీట వేశారని పాత బస్తీ అభివృద్ధి నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
 
హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ… పాతబస్తీలో ఉన్న హెరిటేజ్ పరిరక్షణకు కృషి చేయడం జరుగుతున్నదని, అందులో భాగంగా పురాతన వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు మరమ్మతులు, పునరుద్దరణ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్  పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల మహబూబ్ చౌక్, ముర్గీ చౌక్ అభివృద్ధి, అదేవిధంగా మీర్ అలాం మండి అభివృద్ది కి అనేక కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సర్దార్ మహల్ ను కాపాడుటకు చర్యలు తీసుకోవడం సంతోషదాయకం అన్నారు. గతంలో బల్దియా కార్యాలయం నిర్వహించేవారని, భావితరాలకు అందించేందుకు పునరుద్దరణ పనులు చేపట్టడం జరుగుతున్నదన్నారు. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో రూ. 230 కోట్ల విలువగల పనులకు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. మీర్ ఆలం ట్యాంక్ లో ప్రజల సౌకర్యార్థం రూ. 2.50 కోట్ల తో మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేయడం జరిగిందని, దానితో పాటు 8 కిలోమీటర్ల బండ్ అభివృద్ది చేయడానికి మంత్రి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు కనువిందు చేసే విధంగా బండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 9 నెంబర్ మహ్మదాబాద్ నుండి మీర్ ఆలం ట్యాంక్ వరకు బ్రిడ్జి నిర్మాణం చేపడితే దక్షిణ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరుతుందని, దీనిపై మంత్రి గారు తగు చర్య తీసుకోవాలని కోరారు. బహదూర్ పుర ఫ్లైఓవర్ కు ప్రముఖుల పేర్లు పెట్టాలని ఎంపీ ఓవైసీ మంత్రి ని కోరారు. కార్వాన్ నియోజకవర్గంలో సీవరేజ్, నెట్ వర్క్ పనులను త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా ఆరాంఘర్ నుండి జూ పార్క్ వరకు నిర్మించే ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ ను సకాలంలో పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని ఎంపి కోరారు. అదేవిధంగా నోటరీ ఆస్తులను హక్కు కల్పించేందుకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో హామీ ఇచ్చారని, హైదరాబాద్ పాతబస్తీ తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం నోటరీ ఆస్తులకు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాలపత్తర్ పాత పోలీస్ స్టేషన్ స్థానంలో కొత్తగా రూ. 4.20 కోట్ల తో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించడం జరుగుతున్నదని, దానికి ఈ రోజు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 
 
*శంకుస్థాపనలు – ప్రారంభోత్సవాలు*
 
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు రూ. 580 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 2.కోట్ల 55 లక్షల వ్యయంతో మీర్ ఆలాం చెరువులో మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభించారు. అక్కడే పాత సీవరేజ్ పునరుద్దరణకు రూ. 80 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.  108 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన బహదూర్ పుర ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. కాలపత్తర్ పాత పోలీస్ స్టేషన్ స్థానంలో కొత్త పోలీస్ స్టేషన్ ను రూ. 4.2 కోట్ల వ్యయంతో నిర్మించే పనులను మంత్రి శంకుస్థాపన చేశారు.  చార్మినార్ వద్ద మహబూబ్ చౌక్ (ముర్గి చౌక్)  పునరుద్దరణ  పనులను, రూ. 36 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 21.90 కోట్ల అంచనా వ్యయంతో చార్మినార్ జోన్ లో గల  మీర్ ఆలాం మండి రివ్యంపింగ్ (Revamping) రిజువనేషన్ (Rejuvenation)  పనులకు, సర్దార్ మహల్ అభివృద్ధికి రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం లో  హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి  ద్వారా 297.30 కోట్ల అంచనా వ్యయంతో  జోన్ 3 లో  రిహబిటేషన్ ఆఫ్ సీవరేజ్  నెట్ వర్క్  చేపట్టే  పనికి  మంత్రి కేటిఆర్ శంకుస్థాపన చేశారు. మీర్ అలాం ట్యాంక్ వద్ద రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎస్.సి.టి.పి ని మంత్రి ప్రారంభించారు.
 
 
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి హెచ్.డబ్ల్యూ.ఎం.సి ఎం.డి దానకిషోర్, అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, ఈ.ఎన్.సి జియాఉద్దీన్, ప్రాజెక్ట్ సి.ఇ. దేవానంద్, ఎస్.ఇ దత్తు పంతు, సిసిపి దేవేందర్ రెడ్డి, అడిషనల్ సిపి శ్రీనివాస్, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here