*ఆస్తిప‌న్ను చెల్లింపుకు నేడు తుది గ‌డువు…నేడు అర్థ‌రాత్రి వ‌ర‌కు సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాల పనిచేస్తాయి*

0
216
Spread the love

*ఆస్తిప‌న్ను చెల్లింపుకు నేడు తుది గ‌డువు…నేడు అర్థ‌రాత్రి వ‌ర‌కు సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాలు పనిచేస్తాయి*

*హైదరాబాద్, మార్చి 31 :* ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్ను చెల్లించ‌డానికి వీలుగా బుధవారం 31వ తేదీన జీహెచ్ఎంసీలోని అన్ని సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాలు య‌థావిధిగా ప‌నిచేస్తాయ‌ని జీహెచ్ఎంసీ తెలిపింది. ప్ర‌స్తుత సంవ‌త్స‌ర అర్థ సంవ‌త్స‌ర ఆస్తిప‌న్ను చెల్లించ‌డానికి 31వ తేదీ బుధవారంతో గ‌డువు ముగుస్తుంద‌ని, జ‌న‌వ‌రి 1వ తేదీ నుండి ఆస్తిప‌న్ను బ‌కాయిల‌పై రెండు శాతం జ‌రిమానా విధించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది. ఆస్తిప‌న్ను చెల్లించ‌డానికిగాను సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌న్నీ రాత్రి 12గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని ఆస్తిప‌న్ను చెల్లించాల‌ని న‌గ‌ర‌వాసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌తో పాటు మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ ద్వారా కూడా త‌మ ఆస్తిప‌న్నును చెల్లించ‌వ‌చ్చ‌ని సూచించారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్తిప‌న్ను చెల్లించ‌ని వారికి ఎస్‌.ఎం.ఎస్‌ల ద్వారా ఆస్తిప‌న్ను చెల్లించాల‌ని మెస్సేజ్‌ల‌ను జీహెచ్ఎంసీ పంపింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్ను ల‌క్ష్యం గత సంవత్సరం రూ. 1800 కోట్లకన్నా అదనంగా మరో రూ.100 కోట్లు పెంచి రూ. 1900 కోట్లుగా నిర్థారించింది. నేడు మంగళవారం సాయంత్రం (5 గంటల) వ‌ర‌కు రూ. 1559.38 కోట్లు వ‌సూల‌య్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here