*ఫిబ్రవరి మాసం లో  అందుబాటులోకి రానున్న  ఎల్.బి నగర్ ఆర్ ఎచ్ ఎస్ అండర్ పాస్*

0
132
Spread the love
*ఫిబ్రవరి మాసం లో  అందుబాటులోకి రానున్న  ఎల్.బి నగర్ ఆర్ ఎచ్ ఎస్ అండర్ పాస్*
 
 
*హైదరాబాద్ జనవరి 30:*   రహదారుల వ్యవస్థను మరింత మెరుగు పరిచి ట్రాఫిక్ సమస్య నివారణకు నిర్ధిష్టమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణాలు, అవసరమైన చోట అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ లు, ఆర్.ఓ.బి నిర్మాణాలు చేపట్టి రాజధానిలో రహదారుల వ్యవస్థను అంచెలంచెలుగా అభివృద్ధికి జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ది(SRDP) పథకం ద్వారా రూపొందించిన పలు రోడ్ల ప్రాజెక్టులను రూపొందించి యుద్ధప్రాతిపదికన, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. నగరంలో ఎల్.బి నగర్ కూడాలి అత్యంత ప్రధానమైనది. వరంగల్ నల్గొండ ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు అండర్ పాస్,ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపట్టారు.ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆరంఘర్, మిథాని మీదుగా వచ్చే ట్రాఫిక్ నివారించేందుకు ఎల్.బి నగర్ కుడాలి (RHS) కుడివైపు సివిల్ ఇతర  పనులను చేపట్టేందుకు మొత్తం  రూ. 14.87  కోట్ల వ్యయంతో  490 మీటర్ల పొడవు గల అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. 
ఈ అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పు 7250 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లైన్ ల యూని డైరెక్షన్ లో చేపట్టారు. సికింద్రాబాద్ రెటైనింగ్ బైరమల్ గూడ రిటైనింగ్ వైపు వాల్ లు నిర్మాణాలు అండర్ పాస్ నిర్మాణం వలన సిగ్నల్ ఫ్రీ రహదారిగా ఉప్పల్ నుండి మిధాని వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లవచ్చు. దీని వలన  వాహనాలు వేగంగా, కాలుష్యం తగ్గింపు అవుతుంది.. ఆరాంఘర్  నుండి ఎల్.బి నగర్ వరకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టగా ఓవైసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభం కాగా బహద్దూర్ పుర ఫ్లైఓవర్ మార్చిలో ప్రారంభించేందుకు SRDP అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎల్.బి నగర్ అండర్ పాస్ తో పాటుగా తుకారాం గేట్ రైల్వే అండర్ పాస్ కూడా ఫిబ్రవరి మాసంలో అందుబాటులోకి తేనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here