లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: డీజీపీ

0
152
Spread the love

లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: డీజీపీ  మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు కూకట్ పల్లి జె ఎన్ టి యు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగిస్తుందని, కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దు అని సూచించారు డీజీపీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్స్ తో పాటు హైదరాబాద్ లో జన సాంద్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కఠినంగా పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని అనవసరంగా రోడ్లపైకి వస్తున్నా వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలియజేసారు. అంబులెన్సులు, ఎసెన్షియల్ వెహికల్స్, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది , వ్యాక్సినేషన్ కి వెళ్లే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

డీజీపీ గారి వెంట సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాణిక్ రాజ్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here