గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వెన్నెల‌కంటి రాజేశ్వ‌ర ప్ర‌సాద్‌

0
182
Spread the love

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు… 1979 లో చంద్రగిరి SBI లో పనిచేస్తున్న వెన్నెలకంటి, సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో సినీరంగంలో అడుగిడి దాదాపుగా రెండు వేల పాటలను వ్రాసారు. నవంబర్ 30 న జన్మించారు. హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవారు. కాలేజి రోజుల్లో “రసవినోదిని” రేడియో ప్రసంగాలు వినేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించారు. డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలముతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసారు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత అన్నా చెల్లెలులో పాటలు వ్రాసారు. నాయకుడు సినిమాతో అనువాదంలో ప్రవేశించారు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసారు. కమల్ హాసన్కి సత్యభామ సినిమాకు డబ్బింగు వ్రాసారు. సుమారు 2000 పాటలు వ్రాసారు. ఇతని కుమారులు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగాను, రాకేందు మౌళి సినిమా గీతరచయితగాను ఎదుగుతున్నారు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వెలిబుచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here