*జిహెచ్ఎంసి ని సందర్శించిన మహారాష్ట్ర అమరావతి కౌన్సిలర్ల బృందం*

0
43
Spread the love
*జిహెచ్ఎంసి ని సందర్శించిన మహారాష్ట్ర అమరావతి కౌన్సిలర్ల బృందం*

*తెలంగాణలో మహిళా శిశుసంక్షేమంపై అమలుచేస్తున్న పథకాలపై హర్షం*

*హైదరాబాద్, సెప్టెంబర్ 21:* 
 జిహెచ్ఎంసి, మహిళ శిశుసంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో నగరంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా మహిళలకు, చిన్నారులకు అందిస్తున్న రక్షణ, స్వయం సహాయక బృందాలకు జీవనోపాధి తదితర అంశాలను పరిశీలించడానికి మహారాష్ట్ర అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, ఇద్దరు ఉద్యోగులు జిహెచ్ఎంసిని మంగళవారం సందర్శించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, అర్భన్ కమ్యునిటీ డెవలప్ మెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, మహిళా శిశుసంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమరావతి కౌన్సిలర్లకు వివరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శంకరయ్య మాట్లాడుతూ…  గ్రేటర్ పరిధిలో 42165 స్వయం సహాయక బృందాలలో 4 లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారని, వారి ద్వారా మహిళా గ్రూపులకు బ్యాంకు ద్వారా రుణాలను అందించి వారికి స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని వారికి వివరించారు.  అర్బన్ కమ్యునిటీ డెవలప్ మెంట్ నేరుగా టౌన్ లేవల్ ఫెడరేషన్ కు కొత్త అంశాలపై నేరుగా శిక్షణను అందించి తద్వారా స్లమ్ లేవల్ ఫెడరేషన్, స్వయం సహాయక బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడంలో నిరంతరాయం కృషిచేస్తున్నామని వివరించారు.  స్వయం సహాయక బృందాలకు మైక్రో బ్యాంకు ద్వారా  రుణాలను అందిస్తున్నాం. సంఘ సభ్యురాలికి గరిష్టంగా రూ. 54 వేల వరకు రుణం లభిస్తుంది. దానితో పాటు మహిళా సంఘాల కుటుంబాలకు 25 వేల నుండి 2 లక్షల వరకు రుణ సౌకర్యం పొందుతున్నారని వివరించారు.  స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు రుణాన్ని త్వరితగతిన తిరిగి చెల్లించడం ద్వారా వారు కట్టిన వడ్డీ తిరిగి చెల్లించబడుతుందని తెలిపారు. సంఘ సభ్యురాలికి గరిష్టంగా రూ. 54 వేల వరకు రుణం లభిస్తుంది. మహిళా సంఘాల కుటుంబాలకు రూ. 25 వేల నుండి 2 లక్షల వరకు రుణ సౌకర్యం లభిస్తుంది. నేషనల్ అర్బన్ లేవల్ మిషన్ (ఎన్.యు.ఎల్.ఎం), నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్.యు.హెచ్.ఎం) ద్వారా నిరాశ్రయులైన వారికి జీవనోపాధి, శిక్షణ వంటి సేవలను అందిస్తున్నామని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాన్ని అందించి వారిని ఆర్థికంగా అభివృద్ది పరుస్తున్నామని తెలిపారు. జిహెచ్ఎంసి ద్వారా నిరాశ్రయులకు 13 కమ్యునిటీహాల్స్ లలో షెల్టర్ కల్పించి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. పేదవారి కోసం ప్రత్యేకంగా కోఠి, మహవీర్ తదితర హాస్పెటల్స్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భవనాలలో వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, మెప్మా ద్వారా రిజిస్టార్ అయినవారికి జిహెచ్ఎంసి ద్వారా శిక్షణ ఇప్పించి వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిహెచ్ఎంసి ద్వారా నిరాశ్రయులైనవారికి సివిల్ సైప్లయ్ శాఖ ద్వారా రేషన్ అందిస్తున్నామని అన్నారు.
వీధి వ్యాపారులకు, నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక చేయుత అందించడంతో పాటు వారికి బీమా సౌకర్యాన్ని జన్ దన్, పి.ఎం సురక్ష బీమాయోజన, పి.ఎం జీవనజ్యోతి ద్వారా రూ. 2 లక్షల వరకు బీమా అందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా గుర్తింపు సాధించిందని, ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రానున్న మూడు సంవత్సరాలలో ఎన్.జి.ఓ ల సహకారంతో వంద శాతం పురోగతి సాధిస్తుందని తెలిపారు. అర్భన్ కమ్యునిటీ డెవలప్ మెంట్ ద్వారా వయోవృద్దులకు, మహిళలకు, చిన్నారులకు ప్రభుత్వం ద్వారా వికాసం, భరోసా అందిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసిలో సర్కిల్ వారిగా టీమ్ లను నియమించామన్నారు. జిహెచ్ఎంసి ఆదాయంలో ప్రతి సంవత్సరం 5శాతం అనగారిన ప్రజలకోసం వికాసం, ఆసరా రూపెణ ఖర్చుచేస్తుందన్నారు. అనంతరం మహిళా మరియు శిశుసంక్షేమ శాఖ ద్వారా కిషోర్ బాలిక, గర్భవతి మహిళలకు అంగన్ వాడి కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్, హెల్త్ చెకప్, ఇమ్యునైజేషన్, రెఫరల్ సర్వీసెస్, చిన్నారుల ఎత్తు, బరువులపై తీసుకుంటున్న చర్యలు, మహిళలకు రక్తహీనతపై, కే.సి.ఆర్ కిట్, అమ్మఒడి, కళ్యాణలక్ష్మి, ఆసరా, షీ-టీమ్, భరోసా పైన ప్రజెంటేషన్ ను శివాల్కర్ రెడ్డి, నర్సిహారెడ్డి లు మహారాష్ట్ర అమరావతి కౌన్సిలర్స్ బృందానికి వివరించారు.
కోవిడ్ సమయంలో టీ-షాట్ ద్వారా ప్రతి ఒక్కరికి శాఖాపరంగా మహిళలకు, శిశువులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర అమరావతి కౌన్సిలర్లు మాట్లాడుతూ మా రాష్ట్రంలో కంటే మహిళా శిశుసంక్షేమం పై  తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు.  అంగన్ వాడిలలో రోజువారిగా మహిళలకు అందిస్తున్న పోషకాహారం సేవలు బాగున్నాయని తెలిపారు.  ప్రభుత్వపరంగా విస్తృస్థాయిలో నిధులను పేదప్రజలకోసం ఖర్చుచేయడం విశేషం అన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య ప్రజెంటేషన్ ద్వారా జిహెచ్ఎంసి చేస్తున్న పనులపై కౌన్సిలర్లకు వివరించారు. అమరావతి కౌన్సిలర్లు వందనహార్నే, సునంద, లవీనాహార్పి, స్వాతికులకర్ణి, రుబీనాతబస్విన్, ఇందు, పద్మజ, నీలేష్ వావి సాకర్, అమోల్ సాకురే లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here