మహేష్ బాబు కూతురికి కరోనా టెస్ట్

0
248
sithara-mahesh babu daughter
Spread the love

ప్రజల్లో కొవిడ్ టెస్ట్‌పై ఉన్నా భయాలను పోగొట్టే ప్రయత్నం చేసింది సితార. ముఖ్యంగా తన వయసు పిల్లలకు కొవిడ్ టెస్ట్‌పై స్పష్టతను ఇచ్చింది.సితార
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ముందస్తు రక్షణా చర్యల్లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార కొవిడ్-19 టెస్ట్ చేయించుకుంది. తన ఇంట్లోనే డాక్టర్‌కు స్వాబ్ శాంపిల్స్ ఇచ్చింది. తాను స్వాబ్ శాంపిల్స్ ఇస్తున్న వీడియోను సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కాస్త భయం భయంగానే శాంపిల్స్ ఇస్తున్నట్టు కనిపించింది సితార.అయితే, కొవిడ్ పరీక్ష చేయించుకోవడానికి అస్సలు భయపడవద్దని తన వయసు పిల్లలకు చెబుతోంది సితార పాప. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెసేజ్ ఇచ్చింది.‘కొవిడ్ టెస్ట్ తొలిసారి చేయించుకున్నాను. దీని గురించి నా తోటి వయసున్న పిల్లలకు కాస్త సమాచారం ఇస్తున్నాను. ఈ పరీక్ష చేసుకోవడానికి ముందు నేను సంకోచించాను. కానీ, అమ్మ పక్కనే ఉండటంతో ధైర్యంగా చేయించుకున్నాను. అమ్మ నా చేయి పట్టుకుని ఉంది. మీరు కనుక స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నట్టయితే కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం మరిచిపోకండి. మీరు సురక్షితంగా ఉన్నారో లేదో కచ్చితంగా తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ కొవిడ్ టెస్ట్ ఇబ్బందిగా, కష్టంగా, నొప్పిగా ఏమీ లేదు. కాబట్టి, కొవిడ్ టెస్ట్ చేయించుకుని సురక్షితమైన సమాజాన్ని నిర్మించండి. సురక్షితంగా, సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను’’ అని సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.గత నెల మహేష్ బాబు ఫ్యామిలీ విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తరవాత తొలిసారి ఫ్యామిలీతో విదేశీ యాత్రకు వెళ్లారు సూపర్ స్టార్. ఈ విహారయాత్ర తరవాత కూడా సితార కుటుంబ సభ్యులు, స్నేహితులతో ట్రావెల్ చేసిందట. బహుశా అందుకే సేఫ్టీ కోసం సితారకు కొవిడ్ టెస్ట్ చేయించినట్టున్నారు. మొత్తం ఈ టెస్ట్ ద్వారా ఒక మెసేజ్‌ కూడా ఇచ్చేసింది ఈ లిటిల్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here