మైదాపిండి వంట‌కాలు… వాటి ప్ర‌భావాలు

0
494
Spread the love

మైదాపిండి వంట‌కాలు… వాటి ప్ర‌భావాలు

మనం రోజుతినే ఆహారంలో పుల్కాలు, చపాతి, రోటి, అలాగే వెజ్‍ & నాన్‍ వెజ్‍ రోల్స్ ఈ మధ్య‌ తెలుగువారికి పరిచయమయిన షవర్మా , ఇంకొన్ని బేకరి పదార్థాలు మైదా పిండితో చేసేవే. రుచిగా వున్నాయనో… త్వరగా వండవచ్చు అనో మైదా పిండితో చేసిన ఆహారపదార్థాలు మనం తినే వాటిలో అధిక‌మ‌య్యాయి. కానీ మనకు తెలియకుండా మనం విషం తింటున్నమని ఎంత మందికి తెలుసు. మైదాపిండి, గోదుమపిండి పదార్థాలు కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. అందుకే మైదా తో చేసే పదార్థాలు తిన్నప్పుడు మనకు వెంటనే ఆకలి వేయ‌దు, కడుపు ఉబ్బ‌రంగా వుంటుంది. సినిమా పోస్టర్లు గోడ మీద అతికించడానికి ఎమి వాడుతారో తెలుసా..? వాటిని అతికించడానికి మైదా పిండితో తయారు చేసిన “లై” అనే గుజ్జును వాడుతారు. మనం ఒకసారి ఊహించుకోవచ్చు ఇలాంటి మైదతో తాయారైన పదార్థం ఆహారంగా మన కడుపులోకి వెళ్ళి ప్రేగులను అంటిపెట్టుకుని “లై” అలాగే వుంటే ఎలావుంటుందో..అర్థం చేసుకోండి. జీర్ణం కాని ఆహారం ఎక్కువ సమయం ప్రేగులకు పట్టుకొని వుండటం వలన అక్కడ బ్యాక్టిరియా పుట్టె ప్రమాదం వుంది. సాధారణ గోదుమపిండిని అజోడికార్బోనమైడ్‍, క్లోరన్‍ గ్యాస్‍ ,బెంజాయిల్‍ పెరాక్సైడ్‍ లాంటి రసాయనాలతో ప్రాసెస్‍ చేయడం వలన మైదా పిండి తాయారు చేస్తారు. బెంజాయిల్‍ పెరాక్సైడ్‍ వలనే మైదాపిండి మెత్తగా ఉండి… తెల్లరంగులోకి వస్తుంది. రసాయన ప్రక్రియ ద్వారా తయారు అయ్యే మైదాపిండి వలన క్యాన్సర్‍, కిడ్నీల్లో రాళ్ళు , గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా వున్నాయి. అందుకే వీలైనంత వరకు మైదా పిండి వంటకాల‌కు దూరంగా వుండి సాంప్ర‌దాయక వంటలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

VSK
Writes – VSK

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here