అంకుర సంస్థలకు జాతీయ అవార్డులు ప్రదానం చేయనున్న శోభా కరంద్లాజే

0
53
Spread the love

మేనేజ్ హైదరాబాద్ లో 32 ఉత్తమ వ్యవసాయ అంకుర సంస్థలకు జాతీయ అవార్డులు ప్రదానం చేయనున్న శోభా కరంద్లాజే

మేనేజ్-సమున్నతి ( MANAGE -Samunnati )అవార్డులు 2022 ను రేపు హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న మేనేజ్ సంస్థలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే ప్రదానం  చేయనున్నారు. మేనేజ్-సమున్నతి అవార్డు కోసం దేశం వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ అంకుర సంస్థలు పోటీ పడ్డాయి. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 21 మంది సభ్యులుగా వ్యవహరించిన జ్యూరీ ధరఖాస్తులు పరిశీలించింది. అందిన దరఖాస్తుల నుంచి 32 వ్యవసాయ అంకుర సంస్థలను అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు ( మహిళలు స్థాపించిన రెండు అంకుర సంస్థలకు ప్రత్యేక అవార్డు సహా) అందజేయనున్నారు. ఈశాన్య, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి 27 సంస్థలు రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక అయ్యాయి. జాతీయ అవార్డుకు ఎంపిక అయిన ప్రతి సంస్థకు లక్ష రూపాయలను అవార్డుగా అందజేస్తారు.

కార్యక్రమంలో మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్ర శేఖర, సమున్నతి ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అండ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీ. అనిల్ కుమార్, మేనేజ్ డైరెక్టర్ (వ్యవసాయ విస్తరణ),డాక్టర్ శరవణన్ రాజ్, అవార్డు గ్రహీతలు మరియు అధ్యాపకులు మరియు సిబ్బంది వేడుకలో పాల్గొంటారు.

వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, వినూత్న విధానాలకు రూపకల్పన చేసి రైతులకు సహకారం అందిస్తున్న సంస్థలను గుర్తించి ప్రోత్సహించేందుకు మేనేజ్-సమున్నతి అవార్డులు అందజేయడం జరుగుతుంది. అవార్డు కార్యక్రమంలో అవార్డులు పొందిన సంస్థలు తమ కార్యక్రమాలను వివరిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here