గుంజపడుగు ఎస్.బి.ఐ. బ్యాంకు దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

0
210
Spread the love

 గుంజపడుగు ఎస్.బి.ఐ. బ్యాంకు దొంగతనం కేసు లో నలుగురు నిందితుల పోలీసు కస్టడీ.

 వీరి వద్ద నుండి మహారాష్ట్ర పోలీసులు 2.9 కిలోల బంగారం రికవరీ

 ఆ రికవరిలో 70 శాతం బంగారం గుంజపడుగు ఎస్.బి.ఐ. బ్యాంకు లోనిదే

 పరారీలో ఉన్న ముగ్గురు దొంగలు త్వరలోనే పట్టుకుంటాం ….

మార్చి 24తేదీ రోజున రాత్రి గుంజపడుగు ఎస్.బి.ఐ. బ్యాంకు లో కొంతమంది దొంగలు బ్యాంకు యొక్క వెనుక భాగం నుండి కిటికీ గ్రిల్స్ తొలగించి, గ్యాస్ సిలిండర్ మరియు గ్యాస్ కట్టర్ సహాయం తో సేఫ్టీ లాకర్ ను కట్ చేసి సుమారు 6 కిలోల బంగారం ఆభరణాలు మరియు 18 లక్షల నగదు దొంగిలించుకొని పోయినారు అని ఎస్.బి.ఐ. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ పింగ్వ పిర్యాదు మేరకు మంథని పోలీస్ స్టేషన్ నందు తేది 25-03-2021 నాడు కేసు నమోదు చేసి, ఎ.సి.పి. గోదావరిఖని గారి చేత దర్యాప్తు చేయబడుచున్నది.

వెంటనే నేరస్థలం ను గౌరవ రామగుండము సి.పి సత్యనారాయణ ఐ.పి.ఎస్. గారు, డి.సి.పి పెద్దపల్లి పి.రవీందర్ గారు, ఓ.ఎస్.డి శరత్ చంద్ర ఐ.పి.ఎస్. గారు మరియు సీనియర్ ఆఫీసర్స్ విసిట్ చేసి క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరించండం జరిగింది. నేర విదానాన్ని పరిశీలించి ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగ్ పనే అని ప్రాథమికంగా నిర్దారణ చేయబడింది.

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తేది 01-05-2021 రోజున రామగుండం పోలీసు లు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక నిందితుడు ఆదేశ్ శర్మ ను పట్టుకొని అతని నేరం ఒప్పుదల ఆధారంగా అతని దగ్గరినుండి చోరి స్తోతు సుమారు 20 తులాల బంగారం రికవరీ చేసి నిందితుణ్ణి జుడీష్యల్ రిమాండ్ కి పంపనైనది. ఈ నిందితుని తో పాటు బ్యాంక్ దొంగతనం లో పాల్గొన్న 5 గురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి చంద్రాపుర్ సెంట్రల్ జైల్ కు పంపినారు. ఆ తర్వాత గౌరవ జుడీష్యల్ మెజిస్ట్రేట్, మంథని గారి ఆదేశాల మేరకు తేదీ 10-05-2021 నాడు పి.టి. వారెంట్ పై ఆ 5 గురు నిందితులను వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా మంథని మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిచి రిమాండ్ చేయనైనది. మళ్ళీ గౌరవ మంథని కోర్ట్ ఆదేశాల మేరకు తేదీ 16-05-2021 నుండి 19-05-2021 వరకు అందులోని పైన తెలిపిన 4 గురు నిందితులను పోలీసు కస్టడీ కి కోసం చంద్రాపుర్ జైల్ నుండి నిందితులను తీసుకొని మంథని పోలీసు స్టేషన్ లో విచారించనైనది.

నేరస్తుల వివరాలు:

1. రాజు వసంతరావు వర్భే, 52 yrs, వృత్తి: ఇటుక బట్టి వ్యాపారం, r/o చంద్రాపుర్, మహారాష్ట్ర

2. దేవదాస్ రూప్ చాంద్ కప్గాటే, 35yrs, వృత్తి: హమాలి, r/o గిరోలాహేటి, గొందియా జిల్లా, మహారాష్ట్ర

3. సంకేత్ తేజ్ రామ్ ఉకే, 27 yrs, వృత్తి: కిరాణం, r/o చంద్రాపుర్, మహారాష్ట్ర

4. దాన్వీర్@గ్యాస్టో, 21 yrs, వృత్తి: వెల్డింగ్ పని, r/o హాసన్పూర్, బాదాయు జిల్లా, ఉత్తరప్రదేశ్

ఈ నలుగురు నిందితులను పెద్దపల్లి డి.సి.పి. రవీందర్ గారు మరియు ఓ.ఎస్.డి శరత్ పవార్ ఐ.పి.ఎస్. గారు ప్రత్యేకంగా విచారించి పరారీ లో ఉన్న నిందితుల ఆచూకీ సేకరించినారు.

తదుపరి గోదావరిఖని ఏ.సి.పి ఉమేందర్ గారు నిందితుల ను మూడు రోజులుగా విచారించి, వారి నేర ఒప్పుదల పంచనామా వ్రాసి, నేరం విధానం ను తెలుసుకోగా:

మార్చ్ నెలలో ఉత్తరప్రదేశ్ కు చెందిన 1. నవాబుల్ హసన్ 2. దాన్వీర్ 3. ఆదేశ్ శర్మ 4. గుడ్డు 5. భూరే 6. మాస్టర్ అనే వ్యక్తులు మహారాష్ట్ర లోని 1. రాజు వసంత రావు వార్భే 2. దేవదాస్ రూప్ చాండ్ కాప్ గాటే 3. సంకేత్ తేజ్ రామ్ ఉకే లతో కలిసి చంద్రపూర్ జిల్లా ఎం.ఐ.డి.సి. ఇండస్ట్రియల్ ఏరియా లోని రాజు వసంత రావు వార్భే ఇంట్లో షెల్టర్ తీసుకొని సుమారు ఒక 15 రోజుల పాటు ఉన్నారు. తర్వాత మహారాష్ట్ర లోని గొందియా జిల్లా లో ఒక వెల్డింగ్ షాప్ నందు గ్యాస్ సిలిండర్, రేగ్యులేటర్ మరియు గ్యాస్ కట్టర్ లను దొంగిలించారు. తర్వాత ఒక పథకం ప్రకారం హైవే ల పై ఉండే బ్యాంకు లను టార్గెట్ చేస్కొని వాటిని చోరి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమం లో తేదీ 07-03-2021 నుండి 19-03-2021 వరకు మహారాష్ట్ర లోని రెండు బ్యాంక్ లు, ఒక ATM, ఒక జువెలరీ షాప్ లలో దొంగతనం చేసినారు.

గుంజపడుగు ఎస్.బి.ఐ. బ్యాంకు దొంగతనం విధానం:

తేది 22-03-2021 రోజున 1. రాజు, 2. దేవ, 3.గుడ్డు, 4. మాస్టర్, 5.ఉస్తాద్, 6.ఆదేశ్ లు రాజు యొక్క బొలెరో వాహనం లో చంద్రపూర్ నుండి ఉదయం 6.00 గంటలకుబయలు దేరినారు. మొబైల్ లో లొకేషన్ చూస్తూ మంథని మండలం లోని గుంజపడుగు ఎస్.బి.ఐ. బ్యాంకు కు సాయంత్రం సమయం వరకు చేరుకున్నారు.

 చీకటిపడిన తర్వాత అందాద రాత్రి 9 గంటలకు నలుగురు నిందితులు గుడ్డు, మాస్టర్, ఉస్తాద్, ఆదేశ్ లు బోలెరో దిగి ఎస్.బి.ఐ.బ్యాంకు వెనుకకు చేరుకున్నారు. రాజు మరియు దేవ లు బోలెరో వెనక్కి తిప్పుకొని గోదావరిఖని దాటి బ్రిడ్జ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర బండి పెట్టుకొని పడుకున్నారు. రాత్రంతా నలుగురు నిందితులు బ్యాంక్ ను రేక్కీ చేసినారు.

 తెల్లవారుజామున రాజు మరియు దేవా లు బోలెరో లో గుంజపడుగు వచ్చి, రేక్కీ చేసిననలుగురు నిందితులను ఎక్కించుకొని ఎక్కడ ఆగకుండా చంద్రాపుర్ లోని రాజు ఇంటికి వెళ్ళినారు. మరుసటి రోజు తేదీ 24-03-2021 ఉదయం 6 గంటలకు తొమ్మిది మంది నింద్తులు అదే బోలెరో లో గ్యాస్ సిలిండర్ లు మరియు కట్టర్ లు పట్టుకొని చంద్రాపుర్ నుండి బయలుదేరినారు.

 ఆసిఫాబాద్ సమీపం లో ఆగి ఒక మామిడి తోట దగ్గర్లో అన్నం తిని చీకటిపడే వరకు వేచిచూసి అందాదా రాత్రి 9 గంటల వరకు గుంజపడుగు చేరుకొని, ఎస్.బి.ఐ బ్యాంక్ దాటిన తర్వాత గల ఒక చిన్న బాట గుండా వెళ్ళి బోలెరో ని పక్కకు ఆపుకొని ఏడుగురు గురు నిందితులు 1. గుడ్డు, 2. మాస్టర్, 3.ఉస్తాద్, 4. దాన్విర్, 5.బురియా, 6.ఆదేశ్, 7.సంకేత్ లు బోలెరో నుండి సిలిండర్, కట్టర్ లు పట్టుకొని దిగి బ్యాంక్ వెనుక బాగానికి చేరుకున్నారు.

 రాజు మరియు దేవా లు బోలెరో లో ముందుకు వెళ్ళి మంథని కి చేరుకున్నారు. అక్కడ తినడానికి ఏమీ దొరకకపోవడం తో ఇంకా ముందుకు పోయి రామగిరి లోని రోడ్ పక్కన ఉన్న ఒక హోటల్ లో అన్నం తిన్నారు. అందాద 10.30 కి బోలెరో లోమళ్ళీ వెనక్కి వచ్చి మంథని మెయిన్ రోడ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో బోలెరో పెట్టుకొని పడుకున్నారు.గుంజపడుగు ఎస్.బి.ఐ బ్యాంక్ వెనుక దిగిన ఏడుగురు దొంగలు, బ్యాంకు గోడ ఎక్కడానికి వీలుగా, అక్కడ ఉన్న కట్టెలతో ఒక నిచ్చెన ను తాయారు చేసినారు.

 అందాద మధ్య రాత్రి 11:00 గంటల ప్రాంతం లో గుడ్డు, మాస్టర్, ఉస్తాద్ లు బ్యాంక్ వెనుక గల కిటికీ తలుపులు పగులకొట్టి, గ్రిల్స్ తొలగించి లోపలి ప్రవేశించినారు. మిగిలిన వ్యక్తులు వెంటతెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ ను లోపలి అందించారు. లోపల గల CC కెమెరా వైర్లు కట్ చేసి, ఎలక్ట్రిక్ అలారం ను కూడా కట్ చేసారు. స్ట్రాంగ్ రూమ్ యొక్క తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు.

 స్ట్రాంగ్ రూమ్ లో గల క్యాష్ లాకర్ ను దాన్విర్ గ్యాస్ కట్టర్ తో కట్ చేసి డోర్ ఓపెన్ చేసినారు. అందులో గల 18 లక్షల నగదు మరియు 6 కిలోల బంగారు ఆభరణాలు తీస్కోని ఒక సంచి లో వేస్కొని సుమారు 02:00 గంటలకు బయటికి వచ్చినారు. బ్యాంకు లోనుండి తెచ్చిన సి.సి టి.వి. యొక్క డి.వి.ఆర్ ను అక్కడ పొలాల్లో పారేసినారు. తర్వాత పొలాల్లో నుండి నడుచుకుంటూ మెయిన్ రోడ్ కు వచ్చి ఒక కల్వర్టు కింద దాగిఉన్నారు.

 బ్యాంక్ నుండి బయటికి వచ్చేటప్పుడు, ఎవరైనా అద్దం వస్తే కొట్టడానికి దాన్వీర్ ఒక్ స్టీల్ పైప్ ను కూడా వెంట తెచ్చుకున్నాడు. తర్వాత ఆ స్టీల్ పైప్ ను కల్వర్ట్ వద్దనే పడేసినాడు. తెల్లవారు జామున అందాద 04:30 గంటలకు రాజు మరియు దేవా లు మంథని నుండి బొలెరో వాహనం తీస్కోనిగుంజపడుగు కు చేరుకొని, ఏడుగురు నిందితులను ఎక్కించుకొని దోచుకున్న సొమ్ము తో ఎక్కడ ఆగకుండా చంద్రపూర్ ఎం.ఐ.డి.సి. లోని రాజు ఇంటికి వెళ్ళినారు.

 కొంతసేపు రెస్ట్ తీస్కోని, టిఫిన్ చేసి, తర్వాత గుడ్డు అనే నిందితుడు రాజు మరియు దేవా లకు చెరొక 1,20,000/- రూపాయలు మరియు 150 గ్రాముల బంగారు నగలు ఇచ్చి మిగిలిన బంగారం మరియు నగదును ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆరుగురు దొంగలు పంచుకొని వెంటనే ఉత్తరప్రదేశ్ కు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసు లు ఉత్తరప్రదేశ్ కు వెళ్ళి దాన్వీర్ మరియు ఉస్తాద్@నవాబుల్ అనే నిందితులను పట్టుకొని వారి వద్దనుండి బంగారం రికవరీ చేసి మహారాష్ట్ర కు చెందిన ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేసినారు.

ఈరోజు పైన తెలిపిన నలుగురు నేరస్తుల పోలీసు కస్టడీ ముగియడం తో వారికి మంథని పోలీసులు, గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించి మంథని మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిచినారు. తదుపరి వారిని మహారాష్ట్ర లోని చంద్రాపుర్ జైల్ కు తరలించనున్నారు.

ఇట్టి కేసు నందు ఇంకా విచారణ కొనసాగుతోంది. పరారీ లో ఉన్న ముగ్గురు నిందితులు గుడ్డు, మాస్టర్ మరియు బురియ లను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ లను ఉత్తర ప్రదేశ్ కు పంపించినాము. వారి దగ్గరనుండి ఇంకా మిగిలిన బంగారం మరియు నగదు ను రికవరీ చేస్తాము అని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here