ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ లిస్టులో భార‌తీయ న‌టీన‌టులు

0
60
Spread the love

ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ లిస్టులో భార‌తీయ న‌టీన‌టులు

న్యూఢిల్లీ జూలై 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఆస్కార్ అకాడ‌మీలోకి కొత్త స‌భ్యులు వ‌చ్చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ కొత్త స‌భ్యుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఆ లిస్టులో మ‌న భార‌తీయ న‌టీన‌టులు కూడా ఉన్నారు. బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె త‌ల్లి శోభా క‌పూర్‌లో ఈ ఏడాది రిలీజ్ చేసిన ఆస్కార్ కొత్త క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు. మొత్తం 50 దేశాల‌కు చెందిన 395 మంది స‌భ్యుల‌తో జాబితాను ఆస్కార్ అకాడ‌మీ రిలీజ్ చేసింది.ద క్లాస్ ఆఫ్ 2021 పేరుతో రిలీజ్ చేసిన లిస్టులో 46 శాతం మంది మ‌హిళ‌లు ఉన్నారు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌హానీ, ఫ్యామిలీ డ్రామా తుమ్‌హ‌రి సులు లాంటి చిత్రాల్లో విద్యాబాల‌న్ న‌టించి ప్ర‌శంస‌లు పొందారు. పా, బూల్‌బుల‌య్యా, ప‌రిణీత‌, బాబీ జాసూస్‌, శ‌కుంత‌లా దేవి లాంటి చిత్రాల్లోనూ ఆమె న‌టించారు. 2011లో వ‌చ్చిన ద డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన విద్యాబాల‌న్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here