పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యురాలు

0
64
Spread the love

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యురాలు

ములుగు జూన్ 27 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రాలో మావోయిస్టు దళ సభ్యురాలు మడకం హిడిమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ మేరకు ఆదివారం పస్రా పోలీస్‌స్టేషన్‌లో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లా కట్టెకల్యాణ్‌ మండలం టేట్టం గ్రామానికి చెందిన గొత్తికోయ మహిళ మడకం హిడిమె 2015లో దుమ్ముగూడెం దళం పాటలకు, సాంస్కృతిక కార్యకలాపాలకు, ఉపన్యాసాలకు అకర్షితురాలైంది. ఆ దళ కమాండర్‌ కోవాసి దేవా(భర్త) ఆదేశాల ప్రకారం మావోయిస్టు పార్టీలో సభ్యురాలిగా చేరింది.అజ్ఞాత వాసంలోకి వెళ్లి అగ్రనేతల ఆదేశాల మేరకు పనిచేస్తూ నమ్మకస్తురాలిగా పనిచేసింది. పార్టీ విధానాలు నచ్చక, సభ్యులతో మనస్పర్థలు ఏర్పడి లొంగిపోతానని ఆమె చెప్పగా బలవంతంగా పార్టీలో కొనసాగాలని అగ్రనేతలు ఆదేశించారు. ఈ క్రమంలో హిడిమె మావోయిస్టు పార్టీని వీడి ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో నుంచి బయటకు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తూగూడెం గ్రామంలోని తన బంధువుల సహాయంతో శనివారం సాయంత్రం 5గంటలకు పస్రా ఎస్సై గద్ద రవీందర్‌ ఆధ్వర్యంలో తమ ఎదుట లొంగిపోయి తాను జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు తెలిపిందని ఏఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ అనుముల శ్రీనివాస్‌, ట్రైనీ ఎస్సై సూరం మౌనికారెడ్డి ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here