మరకత శివుని పటాన్ని అందుకున్న
ఎంపీ సంతోష్‌కుమార్
న్యూ ఢిల్లీలోని MP సంతోష్ కుమార్ ను హైదరాబాద్ శంకరపల్లి చండిప్ప మరకత శివాలయ కమిటీ సభ్యుడు దయాకర్ రాజు కలిశారు. శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలోని మరకత శివాలయానికి విచ్చేసి పచ్చ లింగం రూపంలో ఉన్న శివుని దర్శనం చేసుకోవాలని ఆయనను దయాకర్ రాజు ఆహ్వానించడం జరిగింది. ఈ గుడి చరిత్ర గురించి సమూలంగా ఆయనకు వివరంగా చెప్పారు. మరకత శివాలయ జీవిత చరిత్ర పుస్తకాలు కూడా ఆయనకు అందజేయడం జరిగింది. మరకత శివుడి చిత్రపటాన్ని ఆయనకు అందించి ….శాలువా కప్పి సత్కరించారు దయాకర్ రాజు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ శివాలయానికి వచ్చి అభిషేకం చేసుకొని శివుని ఆశీస్సులు పొందుతానని దయాకర్ రాజు కి చెప్పడం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్ ప్రస్తుత రూలింగ్ పార్టీ (JDU) పార్టీ సభ్యులు వరుసగా రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ పార్టీ అధ్యక్షులు నితీష్ కుమార్ ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి. MP సంతోష్ కుమార్ బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు తమ ఇంటికి రావాలని దయాకర్ రాజు నీ బీహార్ ని ఈ సందర్భంగా ఆహ్వానించారు. అదే సందర్భంలో తమ ముఖ్యమంత్రికి కూడా ఆశీర్వదించమని సంతోష్ కుమార్ కోరారు.