మల్టిజెన్ థీమ్ పార్కును సందర్శించిన మేయర్ బొంతు

0
73
Spread the love

మయూరినగర్ లో  రూ 2 కోట్లతో నిర్మిస్తున్న మల్టిజెన్ థీమ్ పార్కును సందర్శించిన మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వవిప్ & ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ*

*గుర్నాధం చెరువు అభివృద్ధి పనులు పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వవిప్/ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ*

*హైదరాబాద్, ఆగస్టు 25:*  రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆశయాల కనుగుణంగా నగరంలో గ్రీనరీని పెంపొందించుటకు జి హెచ్ ఎం సి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్/ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో కలిసి  శేరిలింగంపల్లి జోన్ మియాపూర్ డివిజన్ మయూరి నగర్ కాలనీలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న మల్టిజెన్ థీమ్ పార్కును,గుర్నాధం చెరువు అభివృద్ధి పనులను మేయర్ పరిశీలించారు.మల్టిజెన్ థీమ్ పార్కులో    ఆధునిక పద్దతిలో *దేశంలోనే మొదటగా మెమోరీ గార్డెన్ ను ఏర్పాటు చేస్తున్నారు 3.5 ఎకరాల విస్తీర్ణం లో అనేక ప్రత్యేకతలు  వుండే  ఈ  థీమ్ పార్కు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు.రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కె తారక రామారావు మార్గనిర్ధేశకత్వంలో హైదరాబాద్ ను  హరితనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నగరంలో 320 పార్కులు, 50 థీమ్ పార్కులతో పాటు 120 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.పార్కుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు స్పష్టంచేశారు.  ప్రతి థీమ్ పార్కుకు ఒక ప్రత్యేకత ఉంటుందని తెలిపారు. శేరిలింగంపల్లి జోన్లో 9 థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.నగరంలో వున్న  185 చెరువులను దశల వారిగా  పటిష్ఠపరిచి సంరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. చెరువులలో వున్న   గుర్రపు డెక్క ను ఎప్పటికప్పుడు తొలగించే పనులు చేపట్టినట్లు వివరించారు. శేరిలింగంపల్లి జోన్లో వున్న 70 చెరువులలో  20 చెరువుల రక్షణకు గుర్రపు డెక్కను తొలగించి,   ఫెన్సింగ్,  వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుర్నాధం చెరువు లో చేపట్టిన గుర్రపు డెక్క తొలగింపు, వాకింగ్ ట్రాక్, కట్ట పటిష్టపరిచే పనులపై అధికారులకు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన చెరువు వాచ్ టవర్ ను పరిశీలించారు.

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here