*ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట్‌ల‌లో రెండు ఎక్స్‌ప్రెస్ హై-వే రోడ్ల నిర్మాణం- మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌*

0
252
Spread the love

*ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట్‌ల‌లో రెండు ఎక్స్‌ప్రెస్ హై-వే రోడ్ల నిర్మాణం- మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌*

అంబ‌ర్‌పేట్, ఉప్ప‌ల్‌ల‌లో నిర్మాణం కానున్న భారీ ఫ్లైఓవ‌ర్ల నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయ రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌పై న‌గ‌ర మేయర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌త్యేక దృష్టిసాధించారు. శ‌నివారం ఉద‌యం జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్, టౌన్‌ప్లానింగ్‌, లేక్స్ విభాగం ఇంజ‌నీర్ల‌తో పాటు హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ అధికారుల‌తో క‌లిసి ఉప్ప‌ల్, రామంతాపూర్‌, అంబ‌ర్‌పేట్ త‌దిత‌ర ప్రాంతాల్లో విస్తృతంగా క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించారు. అంబ‌ర్‌పేట్ అలీ కేఫ్ నుండి మెట్రో రైలు డిపో మీదుగా బోడుప్ప‌ల్‌లోని ఏషియ‌న్ మాల్‌ వ‌ర‌కు 150 అడుగుల మేర ర‌హ‌దారిని కొత్త‌గా నిర్మించ‌నున్న‌ట్టు మేయ‌ర్ రామ్మోహ‌న్ తెలిపారు. దీంతో పాటు అంబ‌ర్‌పేట్‌ అలీ కేఫ్ నుండి మూసి మీదుగా ఇమ్లీబ‌న్‌ బస్టాండ్ వరకు 150 ఫీట్ల వెడ‌ల్పుతో మ‌రో రోడ్డు నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్టు మేయ‌ర్ ప్ర‌క‌టించారు. రూ. 467.55 కోట్ల వ్య‌యంతో అంబ‌ర్‌పేట ఫ్లైఓవ‌ర్ నిర్మాణం, రూ. 467.55 కోట్ల వ్య‌యంతో అంబ‌ర్‌పేట ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతున్నందున ఈ మార్గంలో ప్ర‌యాణించేవారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న‌ట్లు తెలిపారు. దీనిలో భాగంగా అంబ‌ర్‌పేట్ అలీకేఫ్ నుండి ఎస్‌.టి.పి మీదుగా ఉప్ప‌ల్ మెట్రో డిపో మీదుగా బోడుప్ప‌ల్‌లోని ఏషియ‌న్ మాల్‌ వ‌ర‌కు దాదాపు 10 కిలోమీట‌ర్ల ఎక్స్‌ప్రెస్ హై-వే రోడ్డు నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్టు, ఈ రోడ్డు నిర్మాణానికి ఏవిధ‌మైన అడ్డంకులులేవ‌ని, ఈ రోడ్డు నిర్మాణంపై గ‌తంలోనే క్షేత్ర ప‌ర్య‌ట‌న జ‌రిపి ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేశామ‌ని తెలిపారు. దీంతో పాటు అలీకేఫ్ స‌మీపంలోని మూసిని ఆనుకొని నేరుగా ఇమ్లీబ‌న్ వ‌ర‌కు దాదాపు నాలుగు కిలోమీట‌ర్ల మేర‌ మ‌రో ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణాన్ని చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని వివ‌రించారు. ఈ రోడ్ల నిర్మాణంపై వెంట‌నే త‌గు అంచ‌నాల‌ను రూపొందించి ప్ర‌తిపాద‌న‌లు స‌మర్పించాల్సిందిగా సంబంధిత శాఖ‌ల ఇంజ‌నీర్ల‌ను ఆదేశించామ‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ పేర్కొన్నారు. అంబ‌ర్‌పేట్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి సంబంధించి రోడ్డు విస్త‌ర‌ణ‌కుగాను ప‌లు ఆస్తుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంద‌ని, అదేవిధంగా ఉప్ప‌ల్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి సంబంధించి కూడా రోడ్డు విస్త‌ర‌ణ‌పై స్థానికులు అంగీకారాన్ని తెలిపార‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ గుర్తుచేశారు. అంబ‌ర్‌పేట్ అలీకేఫ్ నుండి ఇమ్లీబ‌న్ వ‌ర‌కు మూసి మీదుగా రోడ్డు నిర్మాణంతో దిల్‌సుఖ్‌న‌గ‌ర్, మూసారాంబాగ్‌ టి.వి ట‌వ‌ర్ నుండి ఇమ్లీబ‌న్‌, కోఠిల‌కు వెళ్లే ట్రాఫిక్ సుల‌భ‌త‌రంగా మారుతుంద‌ని మేయ‌ర్ పేర్కొన్నారు. అలీకేఫ్ నుండి ఉప్ప‌ల్ మెట్రో డిపో మీదుగా బోడుప్ప‌ల్‌లోని ఏషియ‌న్ మాల్‌ వ‌ర‌కు నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ హై-వే రోడ్డుతో ఉప్ప‌ల్ బ‌గాయ‌త్ నుండి ప్ర‌యాణం మ‌రింత సుల‌భ‌త‌రంగా మారుతుంద‌ని పేర్కొన్నారు. మేయ‌ర్ రామ్మోహ‌న్‌తో పాటు జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, హెచ్‌.ఆర్‌.డి.సి సిఇ మోహన్‌సింగ్‌, టౌన్‌ప్లానింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు, లేక్స్ విభాగం ఓ.ఎస్‌.డి శేఖ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు ప‌ర్య‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here