బల్దియా కార్మికులకు సేఫ్టీ కిట్ లను పంపిణి చేసిన మేయర్, డిప్యూటీ మేయర్

0
94
Spread the love

బల్దియా కార్మికులకు సేఫ్టీ కిట్ లను పంపిణి చేసిన మేయర్, డిప్యూటీ మేయర్

హైదరాబాద్, జూన్ 4 :: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణలో భాగంగా దాదాపు కోటి  రూపాయల విలువైన హెల్త్ కిట్ లను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి లు నేడు పారిశుధ్య కార్మికులకు పంపిణి చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో రూ.4,133 విలువైన ఒక్కో హెల్త్ కిట్ లను 2374 మందికి తొలిదశలో నేడు పంపిణి చేశారు. ఒక్కో కిట్  లో 56 మాస్క్ లు, రేడియం సెఫీటి జాకెట్,  రెయిన్ కోట్, రెండు జతల గ్లౌసెస్, ఒక సెఫీటి షూ, నలభై సబ్బులు, ఒక టవల్, క్యాప్, మూడు శానిటైజర్ బాటిళ్లు,రెండు లీటర్ల కొబ్బరి నూనె, ఒక కిట్ బ్యాగ్ ఉన్నాయి.

ప్రతి ఒక్కరు సెఫీటి కిట్ లను ధరించాలి

వర్షాకాలం ప్రవేశిస్తున్న దృష్ట్యా స్వీయ ఆరోగ్య పరిరక్షణకై ప్రతి  కార్మికులు విధిగా సెఫీటి కిట్ లను ధరించి విధులకు హాజరు కావాలని నగర మేయర్ విజయ లక్ష్మి అన్నారు. కార్మికులకు సెఫీటి కిట్ లను డిప్యూటీ మేయర్ తో కలసి పంపిణి చేసిన సందర్బంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ,  జీహెచ్ఎంసీ  పారిశుధ్య కార్మికుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా నేడు రూ. 98,10,816 ల విలువైన సెఫీటి కిట్ లను అందచేశామని వివరించారు. ఖరీదైన ఈ కిట్ లను తప్పని సరిగా వాడాలని అన్నారు. కరోనా నుండి కాపాడేందుకు గాను ఇప్పటికే కార్మికులందరికీ ప్రత్యేకంగా వాక్సిన్ ఇప్పించామని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ బి. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here