*రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ అభివృద్ధికి 5 వేల కోట్లు

0
38
Spread the love

*రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ అభివృద్ధికి 5 వేల కోట్లు

*హైదరాబాద్, సెప్టెంబర్ 23:* రాష్ట్ర చరిత్ర లో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ అభివృద్ధికి 5 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్, మునిసిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటిఆర్ గార్లకు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయ లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరానికి రానున్న 15 ఏళ్లను కూడా దృష్టిలో పెట్టుకొని 3,866 కోట్లు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. హైదరాబాద్ ప్రజలు అన్ని పార్టీల కార్పొరేటర్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివారు నగర ప్రాంతంలో కూడా త్రాగు నీరు అందించేందుకు 1200 కోట్ల రూపాయలను మంజూరు చేయడం సాహసపూరిత నిర్ణయమని మేయర్ అన్నారు.

హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ లోపలి భాగంలో ఉన్న మున్సిపాలిటీల్లో నగర పాలక సంస్థ ప్రజలకు త్రాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు మేయర్ గద్వాల విజయ లక్ష్మి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here