ప్రతిభను కనబరిచిన వారికి మయూరి ఆర్ట్స్ పురస్కారాలు
ప్రముఖ కళాసంస్థ మయూరి ఆర్ట్స్ గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన వారికి ప్రతిభ పురస్కారాలను అందజేస్తుంది . హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ స్కూల్ ప్రాంగణంలో గత ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు బాబు మోహన్, నటుడు లోహిత్ తదితరులు పాల్గొని వంద మంది కళాకారులకు 2021 సంక్రాంతి టాలెంట్ అవార్డు,విశ్వ సంస్కృతి నంది పురష్కారాలను అందజేశారు. ఎన్నో చిత్రాల్లో నటించిన రాజన్న ఫేం బాల నటి అని, డిజె ఫిలిం నిఖిల్ ఇంకా ప్రముఖ కళాకారుడు కరీంనగర్ వాస్తవ్యుడు గోగుల ప్రసాద్ గారికి కరోనా సమయంలో ఎందరో కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసినందుకు గాను బంగారు కంకణం బహుకరించారు. CID విశ్వనాథ్ లాంటి సిరియల్ కు దర్శకత్వం వహించిన వీర్లపాటి శ్రవణ్ కుమార్ కు విశ్వ సంస్కృతిక నంది అవార్డు అందజేసారు.. ఈ సందర్భంగా కళాకారులను ప్రోత్సహిస్తున్నందుకు గాను మయూరి ఆర్ట్స్ చైర్ పర్సన్ రాధ గారి ని , డైరెక్టర్లు కుమారి సాయి ప్రియ, దత్తుల సేవలను పలువురు కొనియాడారు.
Post Views:
743
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4