లాక్ డౌన్ సమయంలో పెళ్లి.. వందలాది మంది హాజరు

0
141
Spread the love

 

హోమ్ మంత్రితో పాటు వీవీఐపీ, వీఐపీ, రాజకీయనాయకులు హాజరు

పెళ్లికి మరీ దగ్గరుండి సౌత్ జోన్ పోలీసులు సెక్యురిటీ

హైదరాబాద్ సీపీకి  ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లాఖాన్ ట్విటర్ ద్వారా ఫిర్యాదు

హైదరాబాద్ మే 25 (ఎక్స్ ప్రెస్ న్యూస్): పాతబస్తీలో దుబ్బె పెర్‌ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. లాక్ డౌన్ సమయంలో టపాసులు పేలుస్తూ.. హడల్ ఎత్తించింది దుబ్బె కుటుంబం. కనీస సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ రూల్స్ పట్టించుకోకుండా వివాహ వేడుకలు జరిగాయి. కమటి పుర పీఎస్ పరిధిలోని సవేర ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ పెళ్ళికి వందలాది మంది హాజరయ్యారు. వీరిలో వీవీఐపీ, వీఐపీ, రాజకీయనాయకులు ఉన్నారు. దగ్గరుండి మరీ పెళ్లికి సౌత్ జోన్ పోలీసులు సెక్యురిటీ కల్పించారు. సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన పెళ్లి వేడుకలకు హోమ్ మంత్రి మహుమద్ అలీ హాజరయ్యారు. ఈ తతంగంపై తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, హైదరాబాద్ సీపీలకు ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లాఖాన్ ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ‘‘సవేర ఫంక్షన్ హాల్‌లో ఏం జరుగుతోంది? లాక్ డౌన్ సమయంలో ఇంత మంది జనాలు ఎందుకు పోగయ్యారు? లాక్‌డౌన్ సమయంలో రోడ్డు ఎక్కితేనే వాహనాలు సీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని వాహనాలు ఎక్కడ నుండి వచ్చాయి? హైదరాబాద్ పాతబస్తీలో లాక్ డౌన్ రూల్స్ పాటించట్లేదా? సవేర ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్లిపై ఎవరి పై చర్యలు తీసుకుంటారు? దగ్గరుండి సెక్యురిటి ఇచ్చిన పోలీసుల పైనా లేక పెళ్లి జరిపించిన దుబ్బే కుటుంబ పైనా?’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here