మూగ జీవులు పట్ల ప్రేమ చూపాలి: అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్

0
346
Spread the love

మూగ జీవులు పట్ల ప్రేమ చూపాలి: అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్ డిసెంబర్ 22 ( తూఫాన్) – బుధవారం మూగ జీవాలైన జంతువుల పట్ల ప్రేమ దయ చూపాలని వాటిపై క్రూరత్వం ప్రదర్శించరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. మానవులతో పాటు జీవించే జంతువులు అనవసరంగా ఇబ్బందులు పడకుండా హింసించకుండా వాటి సంక్షేమానికి ప్రభుత్వం చట్టాలు చేసి కఠినంగా నిబంధనలు అమలు పరుస్తున్నదని అన్నారు బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సమాజంలో జంతుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టుటకు పశు సంవర్థక శాఖ ఏర్పాటు చేసిన ఎస్.పి .సి.ఏ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మెదక్ సమీపంలోని రాజ్ పల్లి లో రెండు ఎకరాలలో 50 లక్షల వ్యయంతో జంతువుల సంరక్షణ కేంద్రం కుక్కల పునరుత్పత్తి నియంత్రణ కేంద్రాన్నీ నిర్మించనున్నామని టెండర్లు కూడా ఖరారయ్యాయని త్వరలో శంఖుస్థాపన చేయనున్నామని అన్నారు. జిల్లాలో 1. 89 లక్షల పశువులు, 24 వేల కుక్కలు ఉన్నాయని వాటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కాగా జనవరి 15 నుండి 30 వరకు జిల్లాలో జంతు పక్షోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని ప్రతిమ సింగ్ తెలిపారు జంతువుల పట్ల దయ, కరుణతో ఉండుటకు విద్యార్థులలో అవగాహన కలిగించుటకు ఒక్కో పాఠశాల నుండి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ట్రైనర్ల ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ప్రణాళిక రూపొందించవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు అదేవిధంగా విద్యార్థులు ద్వారా ర్యాలీ నిర్వహించాలన్నారు ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుచున్నాయని వాతావరణ కాలుష్యం తో పాటు వాటిని తినడం వల్ల కొన్ని జంతువులు చనిపోతున్నాయని కాబట్టి ప్లాస్టిక్ నిషేధించడంతో పాటు వాడుతున్న ప్లాస్టిక్ రోడ్డు పై పడకుండా ఎత్తులో డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని మునిసిపల్ కమీషనర్లకు సూచించారు వీధులలో పశువులు తిరగకుండా చూడాలని కనిపిస్తే యజమానులపై జరిమానాలు విధించాలని తిరిగి వీధులలో మరోసారి కనిపిస్తే మెదక్ పట్టణ సమీపంలోని మాచారం లో గల గోశాల కు తరలించాలని అన్నారు. ఇలా వచ్చిన జరిమానా డబ్బులను గోశాలల నిర్వహణకు ఇవ్వాలని పొలిసు, మునిసిపల్ కమీషనర్లకు సూచించారు పశువులను తరలించేటప్పుడు ఎక్కువ బాధా కలగకుండా చూడాలని సరిగ్గా లోడింగ్, అన్ లోడింగ్ చేయుటకు ర్యాంప్ ల ఏర్పాటు తో పాటు నీటి సదుపాయం, పశు వైద్యం, సి.సి టి.వి. లు ఏర్పాటు చేయవలసినదిగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓవర్ లోడింగ్ తో జంతువులను తరలించకుండా పొలిసు, రావాణ శాఖ వారు చూడాలని అన్నారు మండలాలలో గోశాల ఏర్పాటు తో పాటు గడ్డి పెంచుటకు స్థలం గుర్తించాలని జిల్లా పంచాయతి అధికారికి సూచించారు నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కోతులు ప్రమాదాల బారిన పడకుండా ఫుడ్ కోర్టుల ఏర్పాటుతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా అటవీ శాఖాధికారులకు సూచించారు ఈ సమావేశంలో పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ విజయశేఖర్ రెడ్డి జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, డిఎస్పీ సైదులు మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, రాష్ట్ర జంతు సంరక్షణ కమిటీ ఉపాధ్యక్షులు స్వమి స్వయం భగవాన్ దాస్ గోశాల ఇంచార్జి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here