రూర్బన్ ప‌థ‌కం క్రింద పనులను శీఘ్రగతిన పూర్తి చేయండి

0
277
Spread the love
రూర్బన్ ప‌థ‌కం క్రింద పనులను శీఘ్రగతిన పూర్తి చేయండి

మెదక్… రూర్బన్ ప‌థ‌కం క్రింద పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాలలో చేపట్టిన పనులను శీఘ్రగతిన పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ యస్. హరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ధిక పరమైన కార్యక్రమాలు చేపట్టి సమగ్ర అభివ్రుదితో పటు వ్రుత్తి నైపుణ్యం పెంపొందించుటకు కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ గా మన జిల్లాలోని పాపన్నపేట మండలం ఎంపిక చేసి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు మంజూర్ చేయగా 435 పనులను గుర్తించి 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 256 పనులు పూర్తి చేసామని, 115 పనులు ప్రగతిలో ఉన్నాయని, మరో 64 పనులు మొదలు పెట్టవలసి ఉందని అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ పధకం క్రింద చేపట్టిన పాటశాలల అదనపు తరగతి గదుల నిర్మాణం, శౌచాలయాలు, సైన్సు ల్యాబ్, పశు సంవర్ధక, గ్రామ పంచాయతి, అంగన్వాడి, వైద్య ఉప కేంద్ర భవనాలు,వైకుంట దామాలకు నీటి సరఫరా, సి.సి. రోడ్ల నిర్మాణాలతో పాటు జ్యుట్ బ్యాగుల తయారి, మీల్స్ ప్లేట్, బేకరి యూనిట్లు నెలకొల్పడం, మిల్లట్స్ ప్రాసెస్సింగ్, ప్యాడి సీడ్ ప్రాసెస్సింగ్, మిల్క్ చిల్లింగ్ సెంటర్ వంటి యూనిట్లు త్వరితగతిన నెలకొల్పుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు వేగావంతమయ్యీలా చూడాలని అన్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు త్వరితగతిన అయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు చూడాలని వారు చేయలేని పక్షంలో అగ్రిమెంట్ రద్దు చేసి ఇతర ఏజెన్సీ లకు ఇవ్వాలని సూచించారు. అలాగే సర్పంచులు చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని లేనిపక్షంలో నిధులు తరలివెళ్లె అవకాశముందని వారికి తెలపాలని సూచించారు. అదేవిధంగా వారు గ్రామాలలో ఏ ఏ పనులు చేస్తున్నారో వాటి వివరాల నివేదిక ఇవ్వవలసినదిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాoట్రాక్టర్ లు ముందుకు రాకపోవడం, భూ సమస్యల వలన ఆగిన పనుల పై అధికారులు దృష్టిపెట్టి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

జూన్,జూలై లో పాటశాలలు తెరిచే అవకాశమున్నందున పాటశాల గదులు, శౌచాలయాల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. ఇంకా మిగిలి పోయిన 13 వైకుంట దామాలకు వారం లోగా నీటి కనేక్చన్ ఇవ్వాలని అన్నారు. ఉపాధి హామీ పధకం క్రింద పండ్ల తోటలు , కూరగాయల క్షేత్రాలు ఏర్పాటు చేయుటకు మాసంలోగా రైతులను గుర్తించి వివరాలు అందించవలసినడిగా ఉద్యాన అధికారిని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా పాల శీతలేకరణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పధకం క్రింద జిల్లాలో చేపట్టిన, అమలవుచున్న కార్యక్రమాలను కేంద్ర అధికారుల బృందం పరిశీలించి కేంద్ర ప్రభుత్వంనిర్దేశించిన మార్గదర్శకాలకనుగునంగానే పనులు చేపట్టారని సంతృప్తి వ్యక్తం చేసారు కాని పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని నివేదికలో పేర్కొన్నారని, కాబట్టి అధికారులు ప్రత్యెక శ్రద్ధ వహించి పనులు వేగవంతం అయ్యేలా చూడాలని , లేనిపక్షంలో నిధులు తిరిగివెళ్ళే అవకాశముంటుందని అన్నారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, జిల్లా పంచాయతి అధికారి తరుణ్, పంచాయత్ రాజ్ ఇ.ఇ. రామచంద్ర రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్, పాపన్నపేట మండల యం.పి.డి.ఓ. తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here