*ఫైర్‌సేప్టీ పై 20న బార్లు, ప‌బ్‌లు, రెస్టారెంట్ల య‌జ‌మానుల‌తో బల్దియా స‌మావేశం*

0
132
Spread the love

*ఫైర్‌సేప్టీ పై 20న బార్లు, ప‌బ్‌లు, రెస్టారెంట్ల య‌జ‌మానుల‌తో బల్దియా స‌మావేశం*

న‌గ‌రంలోని బార్లు, ప‌బ్‌లు, రెస్టారెంట్లలో చేప‌ట్టాల్సిన‌ ఫైర్ సేఫ్టి చ‌ర్య‌ల‌పై నిర్వాహ‌కులు, య‌జ‌మానులతో సోమ‌వారం నాడు ప్ర‌త్యేక స‌మావేశాన్ని జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో చేశారు. 20వ తేదీ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నిర్వ‌హించే ఈ స‌మావేశంలో ప‌బ్‌లు, బార్లు, రెస్టారెంట్ల నిర్వాహ‌కులు, య‌జ‌మానుల‌కు ఫైర్ సేఫ్టి, ఇత‌ర భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, చ‌ట్టాల‌పై పూర్తిస్థాయిలో అవగాహ‌న క‌ల్పించ‌నున్నారు. హైద‌రాబాద్ ఎక్సైజ్ స‌ర్కిల్ ప‌రిధిలో 148 బార్లు, ప‌బ్‌లు, సికింద్రాబాద్ స‌ర్కిల్ ప‌రిధిలో 103, రంగారెడ్డి జిల్లాలో 325 బార్లు, ప‌బ్‌లు ఉండ‌గా మ‌రో 138 ఈవెంట్ ప‌ర్మీష‌న్ పేరుతోనూ బార్లు, ప‌బ్‌లు నిర్వహిస్తున్నారు. మొత్తం 714 బార్లు, ప‌బ్‌ల జాబితా మాత్ర‌మే జీహెచ్ఎంసీ వ‌ద్ద ఉండ‌గా మ‌రో 250కి పైగా బార్లు, రెస్టారెంట్లు కూడా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్నాయ‌ని అంచ‌నా. జీహెచ్ఎంసీ వ‌ద్ద ఉన్న రికార్డుల‌ను సరించి గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న 750 బార్లు, ప‌బ్‌లు, ఈవెంట్ ప‌ర్మీష‌న్‌ల భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు ఫైర్ సేఫ్టిల‌పై జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ విభాగం నోటీసులు జారీ చేస్తోంది. ఫైర్ సెఫ్టి కై చేపట్టిన వివరాలు పేర్కొనే అప్లికెశన్ ఫారాన్ని జీహెచ్హెంసి వెబ్సైట్ www.ghmc.gov.in నుండి డౌన్ లోడ్ చేసుకొని దానిని నింపి జీహెచ్హెంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అంద చేయాలని ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ ప్ర‌క‌టించింది. ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌నే వ్య‌క్తిగ‌త నోటీసుగా ప‌రిగ‌ణించాల‌ని బార్లు, ప‌బ్‌ల‌ నిర్వాహకులకు స్ప‌ష్టం చేశారు. స్ప‌ష్టం చేయ‌డంతో జీహెచ్ఎంసీ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తులను నింపి ప‌లు బార్లు, రెస్టారెంట్లు, ప‌బ్‌ల య‌జ‌మానులు జీహెచ్ఎంసీకి అంద‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌జేయ‌నివారు వెంట‌నే ఫైర్ సేఫ్టీ చ‌ర్య‌ల‌పై ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించాల‌ని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here