తెలంగాణలో కూడా కరోనాను ఆరోగ్యశ్రీలో తీసుకోవాలి: కిషన్‌రెడ్డి

0
85
Spread the love

తెలంగాణలో కూడా కరోనాను ఆరోగ్యశ్రీలో తీసుకోవాలి: కిషన్‌రెడ్డి

యాదాద్రి-భువనగిరి మే 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: రానున్న 15 రోజుల్లో 200 పడకలను ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. కరోనా రెండో దశలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు, చాలా బాధాకరమన్నారు.  లాక్ డౌన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీలో తీసుకున్నారు.. తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.

ప్రపంచంలోనే కరోనా వ్యాక్సిన్ తయారీలో నాలుగు కంపెనీల్లో రెండు కంపెనీలు భారత్‌వేనని తెలిపారు. సోమవారం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌‌ను కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా  కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రస్తుతం 25 ఆక్సిజన్ పడకలతో కూడిన కోవిడ్ చికిత్స విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here