అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో ప్రాంతీయ భాషా సదస్సు

0
153
Spread the love

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ప్రాంతీయ అధికార భాషా సదస్సు

హైదరాబాద్,డిసెంబర్ 4, 2021
రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం కేంద్ర అధికార భాష దేవనాగరి లిపితో కూడిన హిందీ అనే సంగతి అందరికీ తెలిసిందే. తదనుగుణంగా ఆర్టికల్ 351 కింద హిందీ భాషాభివృద్ధికి అవసరమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ రాజ్యాంగపరమైన బాధ్యతల నిర్వహణలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అధికార భాషా విభాగం 2021 డిసెంబర్ 4న తెలంగాణలోని హైదరాబాద్‌ (500063)లో గల కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ వెనుక, ఈసీఐఎల్‌ (ECIL) రోడ్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్,డాక్టర్ హోమీ బాబా కన్వెన్షన్‌ సెంటర్‌ ఆడిటోరియంలో ఉదయం 09:30 గంటల నుంచి ప్రాంతీయ అధికార భాషా సదస్సు, బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తోంది. దక్షిణ-నైరుతి భారత ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు తదితరాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార భాష అమలులో అద్భుత పనితీరు కనబరచిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు తదితరాలకు వివిధ కేటగిరీల కింద ప్రముఖుల ద్వారా పురస్కార ప్రదానం చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ, కేంద్రీయ కార్యాలయాల సీనియర్ అధికారులు/ఉద్యోగులు పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here