శిశు గృహ ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

0
51
Spread the love

అనుకోని కారణాలతో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రభుత్వం బాధ్యతగా ఈ విధిని స్వీకరించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు గృహ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎవరు అనాధాలు గా మిగలకుడదు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం అని అన్నారు. వారికి ఆశ్రయం కల్పించి అమ్మానాన్న లేని లోటును భర్తీ చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. శిశు గృహ ద్వారా చిన్నారులను దత్తత తీసుకునేందుకు అవకాశం కల్పిస్తు అందుకు భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం బాలల సదనం భవనాన్ని శిశు గృహ కేంద్రంగా మార్చిడం జరిగిందన్నారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటైన భవనం నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనాథ పిల్లలకు ఆలంబనగా..
తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అనాథలకు ఆలంబనగా శిశు గృహ కేంద్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. శిశువు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతారని, చిన్నారులను కంటికి రెప్పలా చూసుకునేందుకు ఆరుగురు అన్ని వేళలా సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఎదిగిన పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు శిశుగృహలో ఉంటాయని, వారికి మూడు పూటలా మంచి పౌష్టికాహారం అందతుందన్నారు. వారికి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వైద్యుడు, ఏఎన్‌ఎం నియమించడం జరిగిందన్నారు. శిశు గృహాన్ని మేనేజర్‌ ఎప్పటికప్పుడు అన్ని సౌకర్యాలను పర్యవేక్షిస్తూ పిల్లల పెంపకంతో పాటు తదితర వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తారని పేర్కొన్నారు. ఇక్కడి పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని, అందుకోసం ప్రత్యేకంగా ఈ- సెంటర్‌ ఏర్పాటయిందన్నారు. విప్ రేగా కాంతారావు గారు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు,జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి వరలక్ష్మి గారు, ఐసీసీఎస్‌ అధికారిణి హరికుమారి గారు, వివిధ జిల్లా శాఖల అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here