సంక్షేమ పథకాల అమలులో  తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌

0
112
Spread the love

సంక్షేమ పథకాల అమలులో  తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌

అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ పండుగలకు సియం కేసీఆర్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  వరంగల్ జిల్లా రాయపర్తి ఎమ్పీడీవో కార్యాలయం ప్రాంగణంలో మండలంలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.  ఈ సంధర్భంగా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  తెలంగాణ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ.. దేశంలోనే ఆదర్శంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచారని మంత్రి దయాకర్ రావు అన్నారు.  బతుకమ్మ పండుగకు వచ్చే ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఆడపడుచులకు మేనమామ గా, అన్నాతమ్ముడుగా సియం కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరేలని అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌ పండుగ‌ల‌ని నిర్వ‌హిస్తున్న‌దని అన్నారు. రూ. 333 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లె, అమ్మకు చీరెలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. రెండు సంవత్సరాలుగా కరోనాతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషిచేస్తామని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లేవని అన్నారు.  పేదల పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి కరోనా కష్టకాలంలో అప్పు తెచ్చి, పేదలకు ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు ఇచ్చారన్నారు. కరోనా సమయంలో ప్రజలను కాపాడుకునేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్లు పంపిణీచేసినట్లు, 50 లక్షలు ఖర్చు పెట్టి ఆనందయ్య మందు ఇంటింటికి అందజేసినట్లు ఆయన తెలిపారు. ఆడబిడ్డల కష్టాలను చూసి 40 వేల కోట్లు ఖర్చుపెట్టి గోదావరి నీటిని శుద్దిచేసి ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు  అందజేస్తున్న మహానుభావుడు కెసిఆర్ అని ఆయన కొనియాడారు. ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారుకు పెరగగడంతో ఇంటిలోని పెద్ద వారికి గౌరవం పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి క్రొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇండ్లు కట్టి ఇచ్చే పథకం త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గ్రామాలు, తండాలు బాగుచేసుకున్నామని, ట్రాక్టర్లు, ట్యాంకర్లు సమకూర్చుకున్నామని, పల్లెలు పరిశుభ్రంగా మారాయని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, సమృద్ధిగా సాగునీరు అందించి, రైతుబంధు ద్వారా పెట్టుబడి అందించి రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచారని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇంటింటికి ఇస్తున్నట్లు, వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వచ్చినా ప్రాణాపాయం ఉండదని, త్వరగా తగ్గిపోతుందని ఆయన అన్నారు. మహిళా గ్రూపులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎన్ని కోట్లైనా.. ఋణాలు అందజేస్తామన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో  రూ. 3 కోట్ల 61 లక్షల విలువైన 1 లక్ష 4వేల చీరేలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 24 డిజైన్లు, 810 రంగులతో చీరెలు వున్నట్లు ఆయన అన్నారు. గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యంమని, ఇప్పుడు గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చినట్లు చెప్పవచ్చని అన్నారు. ప్రతి గ్రామంలో స్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, పచ్చదనంతో 2-3 సంవత్సరాలుగా ఎంతో మార్పుతో, గ్రామ స్వరాజ్యం కళ్ళకు కనపడుతుందన్నారు. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బతుకమ్మను అందరూ సంబురంగా జరుపుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here