MGM హాస్పిటల్ లో విలువైన కొత్త CT స్కాన్ ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

0
46
Spread the love

వరంగల్ MGM హాస్పిటల్ లో రూ.2 కోట్ల 14 లక్షల విలువైన కొత్త CT స్కాన్ ను ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. CT స్కాన్ మిషన్ ను పరిశీలించిన మంత్రి, అది పని చేసే విధానం, ఒకరోజు లో ఎంత మందికి స్కాన్ చేయవచ్చు? వంటి విషయాలను అక్కడి సూపరింటెండెంట్, టెక్నీషియన్స్ ను అడిగి తెలుసుకున్న మంత్రి. ఆసుపత్రిలోని ఆవరణలోని పరిసరాలు ఎలా ఉన్నాయో ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడారు ఎర్ర‌బెల్లి. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన సూచ‌న‌లు ఇవే.

“ఎంజీఎం హాస్పిటల్ గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి విశ్లేషించండి. సీఎం కెసిఆర్ దిశా నిర్దేశం, మంత్రి హరీష్ రావు పనితనం తో రాష్ట్రం, మన ఉమ్మడి వరంగల్ జిల్లా లో వైద్య రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నది. సీఎం కెసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వరంగల్ ను హెల్త్ హబ్ గా ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు వరంగల్ లో ఏర్పాటు అవుతున్నాయి. ప్రజలు ఈ సదుపాయాలను పూర్తి ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం విద్య, వైద్య0 పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివి. అదే తరహాలో ఇక్కడ వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలు, ప్రభుత్వం కోరుకుంటున్నది. అందుకు తగ్గట్లుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
అందుకే ఎంజిఎంలో అత్యవసర, ఇతర అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రస్తుతం ప్రారంభించిన ఈ సిటి స్కాన్ ద్వారా అన్ని రకాల స్కానింగ్ లు చేయడం జరుగుతుంది. అత్యవసర విభాగం లో ఏర్పాటు చేసిన ఈ CT ద్వారా, సత్వర చికిత్సకు వీలవుతుంది. ఎంజీఎం CT ద్వారా అత్యవసర పరీక్షలు సులువవుతాయి. ఇక ఎంజీఎం లో బయోమెట్రిక్ పద్ధతి అమలు అవుతున్నది. ఎంజీఎం లో ప్రస్తుతం అన్ని రకాల మెరుగైన వసతులు కల్పించాం. రూ.15 లక్షలతో కొత్త ఎక్స్-రే, రూ. 40 లక్షల విలువైన అల్ట్రాసౌండ్ మెషిన్ ఏర్పాటు చేయడం జరిగింది. 12 కోట్లతో MRI మెషిన్ త్వరలో ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 65 మోకాళ్ల ఆపరేషన్లు మరియు 300 యాంజియోగ్రామ్ లు, క్యాథ్‌లాబ్ కేసులు ఇక్కడ జరిగాయి. ఎంజీఎం ను 1,000 పడకల నుండి 1,300 పడకలకు అప్ గ్రేడ్ చేశాం. ఐ.సి.యు బెడ్లు 100 ఉండగా 180 కి పెంచాం. వెంటిలేటర్ బెడ్లు 25 నుండి 200 బెడ్లకు పెంచాం. ఎంజీఎం లో రెండు ఆక్సిజన్ ట్యాంక్ లు మరియు ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేశాం. పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్ని వార్డులు, కారిడార్లు, దవాఖానా ప్రాంగణాలలో ప్రతిరోజూ మూడు సార్లు శుభ్రపరచమని అదేశించాం. పాత శానిటేషన్ ఏజెన్సీ ని రద్దు చేసి, కొత్త ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి కార్మికుడికి వేతనాలు రూ.9800/- నుండి రూ.15,500/- లకు పెంచుతున్నం. కాంట్రాక్టు పద్దతిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 135 కి గాను 80 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగతా పోస్టులను రెండవ దశలో ఎంపిక చేస్తాం. మరో వైపు PMSSY సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల ద్వారా సేవలు విస్తృత పరిచి, 1 కోటి రూపాయల విలువగల స్టంట్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తున్నాం. పాత సెంట్రల్ జైలు స్థలంలో 11 వందల కోట్ల తో 24 అంతస్థుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. త్వరలోనే వరంగల్ లో ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది.”అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ గోపి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వలప దాసు చంద్ర శేఖర్, వైద్యులు, నర్సింగ్ staff, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
————-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here