కరోనా కట్టడికి కార్యోన్ముఖులు కావాలి –

0
157
Spread the love

 కరోనా కట్టడికి కార్యోన్ముఖులు కావాలి కరోనా వ్యాపించకుండా అన్ని గ్రామాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచాలి కరోనా తీవ్రత కాస్త తక్కువ వున్నా, వ్యాప్తి ఎక్కువగా ఉంది కరోనా మొదటి వేవ్ లో లాగే, రెండో వేవ్ లోనూ ఫ్రంట్ వారియర్స్ గా ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ఉండాలి ఈ వేసవి జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచి, అనవసర ప్రయాణాలు మాన్పించాలి అందరికీ టీకాలు, మాస్కులు తప్పని సరి అలసత్వం వహిస్తే జరిమానాలు అంతా బాగుండాలి అందులో మనముండాలనేదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు పిలుపు, ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 19: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వరంగల్ రూరల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహి0చారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ కలెక్టరేట్ నుంచి మాట్లాడగా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు లు హైదరాబాద్ నుంచి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్లు, zp ల సీఈఓ లు, drdo లు, dpo లు, dlpo లు, ఎంపిడివో లు, mpo లు, apo లు, కార్యదర్శులు తదితర అధికారులు ఆయా మండల కేంద్రాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా గ్రామాలలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేసవిలో గ్రామ పంచాయతీలలో చేపట్టవలసిన కార్యక్రమాలపై కరోనా నియంత్రణ పై, వారికి దిశా నిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here