టిజివో, టియ‌న్‌జివోల డైరీ ని ఆవిష్క‌రించిన మంత్రి ఎర్రబెల్లి

0
125
TGO-TNGO-DIARY INAUGURATION
Spread the love

నూత‌న సంవ‌త్స‌రాన్ని పురస్క‌రించుకుని మంత్రి క్యాంపు కార్యాల‌యంలో( ఆర్ అండ్ బి అతిధి గృహం) పంచాయ‌తీరాజ్ శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టిజివో), తెలంగాణ నాన్‌-గెజిటెడ్ అధికారుల సంఘం(టియ‌న్‌జీవో) నాయ‌కులు. ఈ సంధ‌ర్భంగా డైరీల‌ను ఆవిష్క‌రించారు. అధికారుల సమ‌స్య‌ల ప‌రిష్క‌రించ‌డానికి ముఖ్య‌మంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టిజివో ఉమ్మ‌డి జిల్లా కో-ఆర్డినేట‌ర్ అన్న‌మ‌నేని జ‌గ‌న్మోహ‌న్‌రావు, ఉమ్మ‌డి జిల్లా టియ‌న్‌జివో కో-ఆర్డినేట‌ర్ కోలా రాజేష్‌గౌడ్‌, రాష్ట్ర టియ‌న్‌జివో నాయ‌కులు శ్యాంసుంద‌ర్‌, రామునాయ‌క్‌, రాంకిష‌న్‌, ల‌క్ష్మ‌ణ్‌రావు, టిజివో, టియ‌న్‌జివో జిల్లా నాయ‌కులు సోమ‌య్య‌, ర‌త్నాక‌ర్‌రెడ్డి, పుల్లూరు వేణుగోపాల్‌, డాక్ట‌ర్ ప్ర‌వీణ్‌కుమార్‌, సురేష్‌, సంప‌త్‌, రాజేష్‌, వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు పాల్గోన్నారు.

దివ్యాంగుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్‌రావు నూతన వత్సర వేడుకలు

నూత‌న సంవ‌త్స‌ర వేడుకల‌ను మాన‌సిక విక‌లాంగుల‌తో జ‌రుపుకున్నారు మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్‌రావు. మ‌ల్లికాంబ మ‌నోవికాస కేంద్రంలోని మాన‌సిక దివ్యాంగులైన చిన్నారుల‌కు శాలువాలు క‌ప్పి, నూత‌న సంవత్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. మిఠాయిలు తినిపించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here