అపోహలతో గందరగోళం సృష్టిస్తున్నారు… కోవిడ్ బాధితులకు సరిపడు ఆక్సిజన్ ఉంది

0
120
Spread the love

అపోహలతో గందరగోళం సృష్టిస్తున్నారు…

కోవిడ్ బాధితులకు సరిపడు ఆక్సిజన్ ఉంది

కోవిడ్ వ్యాధి పై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తద్వారా ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా అసత్య ప్రచారాలతో అమాయక ప్రజలను గందరగోళంలో పడేయకూడదని ఆయన కోరారు.
కరోనా వ్యాధి సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపధ్యంలో మంగళవారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో నీ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలసి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో పరిస్థితులు సమీక్షించారు. సూర్యాపేట తో పాటు భోనగిరి,యాదాద్రి,నల్లగొండ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులతో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ,సూర్యపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మూడు జిల్లాల డి యం హెచ్ ఓ లతో పాటు ఆయా జిల్లా కేంద్రాలలోని ఆసుపత్రిల సూపరెండేంట్ లు,ఏరియా ఆసుపత్రుల ఇంచార్జ్ లు పాల్గొన్నారు .ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు సరిపోను ఆక్సిజన్ ,ఆయా ఆసుపత్రులలో బెడ్ లు ఉన్నాయని అవసరానికి సరిపడా మందులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ బారిన పడిన వారితో పాటు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల పై ఉందని ఆయన అన్నారు. ఏ పరిస్తితి నైనా ఎదుర్కునే సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు.ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులన్నింటిని ప్రభుత్వం స్వాధీన పర్చుకుందని ఖాళీల వివరాలు తెలిపేందుకు డ్యాష్ బోర్డుల విధానం ప్రవేశ పెట్టె ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.మే 1 నుండి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.రోజు వారిగా 10 లక్షల పై చిలుకు మందికి వ్యాక్సిన్ ఇవ్వగల శక్తి సామర్ధ్యాలు వైద్య ఆరోగ్యశాఖ కు ఉన్నాయని ఆయన చెప్పారు.ప్రజారోగ్యానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రజలను కాపాడాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని కట్టడికే రాత్రి పూట కర్ఫ్యూ అని ఆయన తెలిపారు.ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి గాను కర్ఫ్యూ ను విజయవంతం చేయాలని మంత్రి ఈటెల పిలుపునిచ్చారు.

ఉమ్మడి జిల్లాలో ఖాళీలు పుష్కలం

ఏ ఒక్కరూ ఆందోళన చెందకండి

అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది

-మంత్రి జగదీష్ రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనీ ఆసుపత్రిలలో ఖాళీ బెడ్స్ చాలా ఉన్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు తెలిపే విధంగా డ్యాష్ బోర్డుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత శాఖామంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారన్నారు.తద్వారా ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు అందుబాటులో కి రానున్నాయన్నారు.సూర్యాపేటలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆయన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలతో పాటు ఆయా జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రిలలో ఖాళీల వివరాలపై మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో అరా తీశారు.ఇప్పటి వరకు ఐదు అంటే ఐదు శాతమే వినియోగించుకుంటుండగా ప్రభుత్వ ఆసుపత్రిలలో ఖాళీలు లేవంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,అవసరమైన వైద్య సహాయం అందించి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తేల్చిచెప్పారు. జిల్లాల వారిగా బెడ్ ల వివరాలను ఆయన వెల్లడించారు.భోనగిరి యాదాద్రి జిల్లాలో భోనగిరి ఏరియా ఆసుపత్రి తో పాటు ఆలేరు,రామన్నపేట,చౌటుప్పల్ సి హెచ్ సి లలో కలిపి మొత్తం 210 ఉండగా అందులో 50 బెడ్లు కోవిడ్ పేషంట్ల కు కెటయించడం తో పాటు బీబీనగర్ వద్ద ఉన్న ఎయిమ్స్ లో 80 బెడ్లు కోవిడ్ పేషంట్ల కోసమే కేటాయించినట్లు ఆయన చెప్పారు. అంతే గాకుండా ఎయిమ్స్ తో సహా భోనగిరి,ఆలేరు,రామన్నపేట, చౌటుప్పల్ లలో ఆక్సిజన్ వసతి 60 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.అయితే ఇప్పటివరకు రోగుల సంఖ్య కేవలం 10.49% ఉందని ఆయన చెప్పారు. అదే విదంగా సూర్యాపేట,నల్లగొండ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇదే తీరులో ఉందన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు పదికి పై బెడ్ లు ఉన్న ప్రయివేటు ఆసుపత్రిలను కూడ ప్రభుత్వ అధీనం లోకి తీసుకున్నామన్నారు.అదనంగాసిబ్బంది అవసరం అనుకంటే తాత్కాలిక భృతి పై నియమించుకునే విదంగా ఆయా జిల్లాల కలెక్టర్ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here