17 నెలల విశ్వకు ప్రభుత్వం అండ.. కేటీఆర్ సూచనలతో తక్షణమే సాయం

0
49
Spread the love
  • అనూష కుమారుడు 17 నెలల విశ్వకు ప్రభుత్వం అండ
  • కేటీఆర్ సూచనలతో తక్షణమే సాయం అందించిన మంత్రి గంగుల కమలాకర్
  • అభాగ్యులకు అండగా నిలవడంలో కేసీఆర్ ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది
  • భవిష్యత్‌లో సైతం అండగా ఉంటామని భాదిత కుటుంబానికి మంత్రి హామీ

ఆపన్నులకు అందుబాటులో ఉంటూ ఆదుకునే కేటీఆర్ గారి చొరవతో మరో కుటుంబానికి అండ దొరికింది, కరీంనగర్‌కు చెందిన కదాసి అనూష కుమారుడు 17 నెలల విశ్వకు రెండునెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చాలా క్లిష్టమైన ఈ ఆపరేషన్‌కి చాలా డబ్బులు ఖర్చు చేసింది ఈ కుటుంబం, ఇప్పుడు సహాయం కోసం మంత్రి కేటీఆర్‌ని ట్విట్టర్ ద్వారా అర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక మంత్రి అయిన గంగుల కమలాకర్‌కి అనూష వివరాలు కనుక్కొని సాయం చేయాల్సిందిగా సూచించారు. తక్షణమే స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ అనూష వివరాలు సేకరించి తనకు కావాల్సిన సహాయానికి సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమే కాక, తక్షణ సహాయంగా పదివేల రూపాయలను తన క్యాంపు కార్యాలయంలో ఈ రోజు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, కేవలం ఒక్క ట్వీట్ దూరంలోనే కేటీఆర్ గారు అందుబాటులో ఉండడమే కాక, సమస్యల్లో ఉన్న వారికి సాయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ అబాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు, అనూష కుమారుడు విశ్వకు భవిష్యత్తులో అవసరమైన వైద్య సాయంతో పాటు సీఎంఆర్ఎఫ్ సాయాన్ని సైతం తొందరగా అందించి ఆ కుటుంబానికి అన్ని విదాల అండగా ఉంటామన్నారు. ప్రతీ నెల అనూష కుటుంబాన్ని ఆదుకునేవిదంగా స్థానిక యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశారు మంత్రి గంగుల. ప్రభుత్వ సాయానికి చలించిన అనూష వెంటనే ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ తో పాటు గంగుల కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here