దమ్మక్క పేటలో పర్యటించిన బీసీ సంక్షేమ మంత్రి

0
120
Spread the love

దళిత బంధు సర్వే లో భాగంగా హుజరాబాద్ పట్టణంలోని దమ్మక్క పేటలో పర్యటించిన బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్…

ఈ సందర్భంగా దళితబంధు లబ్ధీదారులు శోభమ్మ- బొందయ్య ఇంటికి వెళ్లి వారితో మమేకమై కూర్చుండి దళిత బంధు పథకం పై వారికి అవగాహన కల్పించారు..
మంత్రి గంగుల వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు… దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఈ దళిత బంధుని ఉద్యమ కార్యక్రమం లాగా తీసుకొచ్చారని వివరించారు… దళిత బంధు లబ్ధిదారులు అంతా ఒకే వ్యాపారంపై దృష్టి సారించకుండా అధికారుల సూచనలతో వివిధ రంగాలపై మెళకువలు నేర్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు… కెసిఆర్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలుపారు, దళిత బంధు పథకం లో ఇచ్చిన పది లక్షలను ఏడాదిలోగా 20 లక్షలు చేసి చూపించాలని వారికి సూచించారు ఈ సందర్భంగా మంత్రి దమ్మక్క పేట లోని దళిత కాలనీలో కాలినడకన తిరుగుతూ వారి వివరాలు సేకరించారు, ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here