మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్లతో మంత్రి గంగుల కమలాకర్ బేటి..చర్చలు సఫలం

0
72
Spread the love

మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్లతో మంత్రి గంగుల కమలాకర్ బేటి

చర్చలు సఫలం, ధాన్యం ఆన్లోడింగ్ కు మిల్లర్ల అంగీకారం

కేంద్రం నిరాకరించినా సీఎం కేసీఆర్ గారు రైతుల తరుపున ధాన్యం కొంటున్నారు

యాసంగి ధాన్యం సేకరణలో మిల్లర్లు బాగస్వామ్యం కావాలి

రైతుకు, మిల్లులకు సంబందం ఉండకూడదు, ఒక్క కిలో తరుగు పెట్టడానికి వీలులేదు

మిల్లర్ల ప్రతిపాధనలు సీఎస్ కమిటీకి, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తాం – గంగుల కమలాకర్

టెస్ట్ మిల్లింగ్ ప్రాంతాల వారీగా చేసి ఔటర్న్ నిర్ణయించండి – మిల్లర్లు

గతంలో పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించండి

మిల్లర్లను దొంగలుగా చూడడం బాదిస్తుంది

రైతులు, మిల్లర్లు ఒకరికొకరుగా పనిచేస్తాం

ప్రభుత్వానికి సహకరిస్తాం, లాబాలు రాకున్నా నష్టం లేకుండా చూడాలని కోరుతున్నాం- మిల్లర్లు


రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ రోజు ఎర్రమంజిల్ లోని సివిల్ సప్లైస్ భవన్లో బేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణపై మిల్లర్లతో నిర్వహించిన ఈ సమావేశం సుధీర్ఘంగా కొనసాగింది, కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నుండి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి గంగుల, రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను కేంద్రం నట్టేట ముంచిన పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను ఆదుకునేందుకు సంపూర్ణ మద్దతు దరతో తెలంగాణ రైతాంగం పండించిన చివరి గింజ వరకూ సేకరించాలని నిర్ణయించారన్నారు మంత్రి గంగుల. ఈ సందర్భంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మిల్లర్లకు సూచించారు, మిల్లర్ కు రైతుకు సంబందం ఎందుకని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి మిల్లుకు పంపుతామని ఎట్టి పరిస్తితుల్లోను ఒక్క కిలోను సైతం మిల్లుల్లో కోత పెట్టవద్దని సూచించారు మంత్రి గంగుల కమలాకర్, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వేసిన కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేసారు. సీఎంఆర్ విషయంలోనూ సహకరించాలని సూచించారు. గతంలో సాగు ఇంత జరగలేదని, కరెంటు లేక, అటు రైతులు ఇటు రైస్ మిల్లులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24గంటల కరెంటు, సాగు నీరు, రైతు బందు, రైతు బీమా వంటి వ్యవసాయ అనుకూల రైతు విదానాలతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతన్నారని, ఒకరికొకరు అనుసందానంగా ఉండే మిల్లర్లు సైతం బాగుపడే దశలో ఎఫ్.సిఐ ఏర్పడ్డప్పటి నుండి అనుసరిస్తున్న విదానాలను కాలదన్ని కేంద్రం రైతులతో వ్యాపారం చేయడం దురద్రుష్టం అన్నారు మంత్రి గంగుల. వ్యవసాయాన్ని వ్యాపారంగా కాక సామాజిక బాధ్యతతో చూడాలని, ఆదాయమే కావాలంటే జీఎస్టీ, ఇన్ కంటాక్స్ వంటి వాటిలో చూసుకోవాలన్నారు. శ్రీలంక వంటి సంక్షోభం మన దగ్గర వస్తే ఏ దేశం కూడా మన దేశాన్ని ఆదుకోలేదని అందుకే ఫుడ్ సెక్యూరిటీ ఆక్ట్ ని నిరుకార్చకుండా కనీసం 3 ఏళ్ల ఆహార నిల్వలు ఉంచుకోవాలన్నారు మంత్రి గంగుల. అనంతరం ప్రతీ మిల్లర్ తో మాట్లాడారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్ల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనం అని అంటే అలర్లు స్రుష్టించాలనే కపట కుట్రలతో రైతులను నిండా ముంచి ప్రయోజనం పొందాలని కొందరు చూసారని కానీ ముఖ్యమంత్రి రైతుల్ని నష్టపోకుండా ఆదుకున్నారని అదే విదంగా మిల్లింగ్ ఇండస్ట్రీని ఆదుకోవాలన్నారు, కొంత మంది మిల్లర్లను దొంగలుగా చూస్తుంటే బాదగా ఉందన్నారు. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు అందర్నీ బాధ్యుల్ని చేయొద్దన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న మిల్లింగ్ ఇండస్ట్రీ యాసంగిలో ఎప్.సి.ఐ కోరిన మేరకు ఔటర్న్ రాదనే భయంతో ధాన్యం అన్లోడింగ్ కు కొంత మంది మిల్లర్లు భయపడుతున్నారని మంత్రి ద్రుష్టికి తమ సమస్యల్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎఫ్.సి.ఐ తో ఇబ్బందుల్ని ప్రస్థావిస్తూ రాష్ట్రంలో 2400 మిల్లుల్లో 1500 పై చీలుకు బాయిల్డ్ మిల్లులున్నాయని ఎఫ్.సి.ఐ, కేంద్రం తీరుతో వీటిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డుపైకొచ్చే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు, రా రైస్ మర ఆడించడం వల్ల ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందని వాపోయారు. నూక, తవుడు వంటివి పోయినా.. మిగతా షార్ట్ ఫాల్ ఎలా భర్తీ చేయాలనే ఆవేదన వ్యక్తం చేసారు. మిల్లింగ్ ఇండస్ట్రీ మూతపడితే రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని నిర్వేదం వెలిబచ్చారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల సమర్థతతో పాటు సీఎస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా టెస్ట్ మిల్లింగ్ చేసి ప్రాంతాల వారీగా ఎంత బియ్యం వస్తుందో నిర్ణయించాలని విజ్ణప్తి చేసారు. పెండింగ్లో ఉన్న పాత సమస్యల్ని సైతం పరిష్కరించాలని కోరారు. లాబాలు రాకున్నా నష్టపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ణప్తి చేసారు.

 


అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ రైస్ మిల్లర్లు లేవనెత్తిన అంశాల్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెల్తానని, సీఎస్ కమిటీ ఖచ్చితంగా అందరికీ అనుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కడుపు నింపే వ్యక్తని ఏఒక్కరూ కడుపు కొట్టరని, ఎవరూ ఆధైర్య పడవద్దని, కేంద్రం నిట్ట నిలువునా ముంచినా ఈ కష్ట సమయంలో అందరం సమన్వయంతో పనిచేస్తూ రైతుల్ని కాపాడుకుందామని అన్నారు మంత్రి గంగుల. మంత్రి గంగుల మాట్లాడిన తీరుతో మిల్లర్లు ప్రభుత్వానికి సహకరిస్తామని ధాన్యం అన్లోడింగ్ చేసుకుంటామని మంత్రికి తెలియజేసారు. ఈ సమావేశంలో రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ధాన్యం కొనుగోళ్ల వివరాలతో కూడిన ప్రత్యేక సంచిక విడుదల చేసారు.

ఈ సమావేశంలో పాల్గొన్న సివిల్ సప్లైస్ కమిషనర్ మిల్లర్ల సూచనలను పరిశీలిస్తామని, గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలని పరిష్కరిస్తామని, సీఎస్ కమిటీ రిపోర్ట్ ప్రకారం నడుచుకుంటామని తెలియజేస్తూ, యాసంగి పంట సేకరణకు మిల్లర్లు సంసిద్దంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ జీఎంలు, ఉన్నతాధికారులు, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యులు, పెద్ద ఎత్తున మిల్లర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here