సర్వాయిపాపన్న ఆశయసాధకుడు కేసీఆర్

0
96
Spread the love

సర్వాయిపాపన్న ఆశయసాధకుడు కేసీఆర్

తెలంగాణ ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
.ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి

—- : జయంతి వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్

సర్వాయి పాపన్న ఆశయ సాధకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని , గోల్కోండ కోటపై జెండా ఎగరెసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు..

నేడు కరీంనగర్ లో సర్వాయి పాపన్న 371 జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆయన పౌరుషాన్ని ప్రతఒక్కరు ఆదర్శంగా తీసుకోని రాజ్యాధికారమె లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు

300 సంవత్సరాలకంటే ముందే బహుజన రాజ్యం కోరకు గోల్కోండ కోటను అధిరోహించి గోల్కోండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేసారు.

పాపన్న గౌడ్ ఒక గౌడకులానికే కాకుండా బిసి సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని , పేత్తందారులను ఎదురించి పెద ప్రజలకు అండగా నిలిచారని ఆదుకున్నరని అన్నారు..

ఈ కార్యక్రమంలో కరీంనగర్ CP సత్యనారాయణ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, Acp మహేష్ గౌడ్, CI లు తాట లక్ష్మిబాబు గౌడ్, నరేష్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం నాయకులు గణగాని సత్యనారాయణ గౌడ్(కలర్ సతన్న), సింగం సతయ్య గౌడ్, కట్ట సత్తయ్య గౌడ్, గౌడ శంఖారావం పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ గౌడ్, తరుణ్ గౌడ్ ,కార్పొరేటర్ లు కోటగిరి భూమగౌడ్ , , గుగ్గిల్ల శ్రీనివాస్ గౌడ్, గుగ్గిళ్ళ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here