ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సుభిక్షంగా తెలంగాణ

0
51
Spread the love

ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు సంతోషంగా సుభీక్షంగా ఉన్నారని, అది చూసి ఓర్వలేనితనంతో కుళ్లుతో బీజేపీ నేతలు తమ చేతుల్లో ఉన్న అధికార సంస్థల ద్వారా తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు హైదరాబాద్లోని తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. కేంద్రం పెడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం గమనిస్తున్నారని, ఎప్.సి.ఐ ఏర్పడ్డ 60 ఏళ్లలో ఏనాడు రాని ఇబ్బందుల్ని కొత్తగా కావాలని స్రుష్టిస్తున్న విషయం ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. అందులో బాగంగానే రెండు చిన్న కారణాలను బూచీగా చూపి ధాన్యం సేకరించమని అంటున్నారన్నారు. ప్రధానంగా ధాన్యం పీజికల్ వెరిఫికేషన్కి అనుకూలంగా ఉంచడం లేదని, ఉచిత బియ్యం ఇవ్వలేదని అన్న విషయాలపై సమగ్రమైన వివరణ ఇచ్చారు మంత్రి గంగుల.

ఉచిత బియ్యం కేంద్రం కన్నా ముందే రాష్ట్రం ప్రారంభించింది

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించక ముందే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా సంక్షోభం మొదలైన 2020 మార్చిలో ఉచితంగా బియ్యంతో పాటు నెలకు 1500 లచోప్పున రెండు నెళ్లు అందిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసారు మంత్రి గంగుల, ఈసందర్బంగా మాట్లాడుతూ మన రాష్ట్రంలోని 90.46 లక్షల కార్డులకు 2 కోట్ల 87 లక్షల యూనిట్లకు కేంద్రం కేవలం 53 లక్షల కార్డులకు మాత్రమే రేషన్ పంపిణీ చేస్తుందని, మిగతా అర్హులకు సైతం కడుపునిండా తిండిపెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత భారాన్నైనా భరించి అందరికీ రేషన్ అందిస్తున్నారన్నారు. 2020 ఎప్రిల్ నుండి నవంబర్ వరకూ 8నెలలకు కేంద్రం అందించిన 5 కిలోల ఉచిత బియ్యానికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి మూడు నెలలు 7కిలోలు తర్వాత మూడు నెలలు మరో 5 కిలోలు కలిపి పది కిలోలు ఉచితంగా అందించిందన్నారు. ఇందుకోసం 980 కోట్ల అదనంగా కేటాయించిదన్నారు. అలాగే రెండోవిడతలోనూ 2021 జూన్ నుండి ఎప్రిల్ 2022 వరకూ అదే విదంగా 1134 కోట్లు అదనంగా కేటాయించామన్నారు. తాజాగా మార్చి 28న ఉచిత ఆహార పథకాన్ని పొడిగిస్తున్నామని లేఖ ఇచ్చారని, ఆ పాటికే మన దగ్గర పంపిణికి ఏర్పాట్లు చేయడంతో పాటు బియ్యం సేకరణకు సమయం పడుతుందని, అలాగే అదే సమయంలో ధాన్యం సేకరణ సైతం ఉండడంతో కేవలం మే మాసంలో మాత్రమే ఇవ్వలేదన్నారు. ఐనప్పటికీ ఉచితంగా అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలిచ్చారన్నారు మంత్రి గంగుల. ఈనెల నుండి అదనంగా ఐదు కిలోల్ని ఉచితంగా అందిస్తామని ఈ నెల 18 నుండి 26 వరకూ ఈ బియ్యాన్ని అందజేస్తామన్నారు. ఈ నెల నుండి డిసెంబర్ వరకూ ఉచిత పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇందుకోసం 436 కోట్ల అదనపు భారాన్ని సైతం భరించడానికి సిద్దమయ్యారన్నారు. ఈ విదంగా ఇప్పటివరకే ఖర్చు చేసిన 4780 కోట్లకు వీటిని కలిపితే 5216 కోట్లను ఉచిత బియ్యానికి కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ గారిదన్నారు మంత్రి గంగుల.

ఒక్క గింజనూ వదులుకోం, అనవసర బదనాం చేయొద్దు

మరో అంశం ఫిజికల్ వెరిఫికేషన్ పై కూలంకషంగా వివరించారు, రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లో ధాన్యం సేకరిస్తున్నామని, స్వయంగా ముఖ్యమంత్రి గారి పోరాటంతో కేవలం రా రైస్ మాత్రమే తీసుకుంటామని ఎప్.సి.ఐ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుందన్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి గంగుల. 3500 కోట్ల నష్టాన్ని భరించి ధాన్యం సేకరణ చేస్తున్న సమయంలో, అనువుగాని వేలల్లో పిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తుందన్నారు. అసలు వడ్లకు కేంద్రం డబ్బులిచ్చిందా అని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డబ్బులు పెట్టి కొంటుందని, అవి రాష్ట్రం ధాన్యమని కేవలం బియ్యం ఇస్తున్నప్పుడే కేంద్రం డబ్బులిస్తుందని అటువంటప్పుడు మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు మంత్రి గంగుల. ఐనప్పటికీ అన్ని విదాల సహకరిస్తున్నామని మార్చిలో 3007 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించిన ఎప్.సి.ఐ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 162.54 లక్షల మెట్రిక్ టన్నులు, బ్యాగుల్లో 40.63 కోట్ల ధాన్యంలో కేవలం 0.7 శాతం 4,53,896 బ్యాగులు 40 మిల్లులలో తేడాలు ఉన్నాయని నివేదించిందని, దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖతో కలిసి ఎప్.సి.ఐ పునర్ తనిఖీలు నిర్వహించగా అందులో 30 మిల్లులు సరిగానే ఉన్నాయని అదే సంస్థ సర్టిఫై చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. పది మిల్లులో ఐదింట్లో రికవరీ ప్రాసెస్ కొనసాగుతుందని 3 మిల్లులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నామన్న మంత్రి మిగతా రెండు మిల్లుల నుండి 125 శాతం ధాన్యాన్ని రికవరీ చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రతీగింజను కాపాడుకుంటామన్న మంత్రి అక్రమాలకు పాల్పడ్డ ఎవరినీ ఉపేక్షించమని, ఒక్క గింజనీ వదులుకోబోమన్నారు.
ఎప్.సి.ఐ లేఖలో పేర్కొన్న మరో అంశం 63 మిల్లులపై షార్టేజీ ఉందన్న అంశంపై వివరణ ఇచ్చారు మంత్రి గంగుల, వీటిపై ఇప్పటికే కలెక్టర్లకు తనిఖీల కోసం ఆదేశాలిచ్చామని, క్షుణ్నంగా తనిఖీల తర్వాత దోషులని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, క్రిమినల్ కేసులు, ఆర్ ఆర్ ఆక్ట్ ప్రకారం ఒక్క గింజను వదలకుండా రికవరీ చేస్తామన్నారు.
ఈ అంశాలపై ఎప్.సి.ఐకు రాతపూర్వకంగా వివరాలు తెలిపి ధాన్యం సేకరించాలని కోరతామన్నారు. రారైస్ ఎంతైనా కొంటామని ప్రగల్బాలు పలికిన బీజేపీ నేతలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎప్.సి.ఐతో తాడో పేడో తేల్చుకుంటారా లేదా అని అడిగారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయమని పోరాడుతుంటే కేంద్రానికి వత్తాసు పలుకుతున్న బీజేపీ నేతల బండారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ధాన్యం సేకరణపై విలేఖరులకు వివరించారు మంత్రి గంగుల. 6584 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని ఇందులో 4574 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి మూసేసామన్నారు. 8 లక్షల 34వేల మంది రైతుల నుండి 9138 కోట్ల విలువ గల 47 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఇప్పటివరకూ సేకరించామన్నారు ఇందులో 46 లక్షల మెట్రిక్ టన్నుల్ని మిల్లులకు తరలించామన్నారు.

పెట్రోల్, డీజిల్ కొరత రానీయం

బంకు యజమానులు పెట్టిన ఇండెంట్ ప్రకారం సప్లై చేయండి

అనంతరం రాష్ట్రంలోని ఆయిల్ కంపెనీలైన ఐవోసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో పెట్రోల్, డీజిల్ కొరత అంశంపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రి గంగుల. 3520 పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా కొరత లేకుండా చూడడంతో పాటు పెట్రోల్ బంకులకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని ఆదేశించారు. బంకులు పెట్టుకున్న ఇండెంట్ ప్రకారం ఆయిల్ సప్లై చేయాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. ఏ ఒక్క బంకులోనూ క్రుత్రిమ కొరత స్రుష్టించవద్దని అలాంటివి ద్రుష్టికి వస్తే తక్షణమే లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. ఇవాల సాయంత్రం కల్లా ఎక్కడా సమస్య ఉందని కంప్లైంట్ రాకుండా చూసుకోవాలని అదికారులను ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్.

పెట్రోల్ సమీక్షలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ తో పాటు ఆయిల్ కంపెనీల రాష్ట్ర కోఆర్డినేటర్ వైపీ సింగ్, ఐఓసీఎల్ జీఎం ఎంబి మనోహర్ రాయ్, బీపీసీఎల్ డీజీఎం కేఎస్వీ బాస్కర్ రావు, హెచ్పీసీఎల్ చీఫ్ మేనేజర్ పి మంగీలాల్, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం అమరేందర్ రెడ్డి, ప్రతినిదులు వి.వినోద్. ఎల్వీ కుమార్, వై.శ్రీనివాస్, బ్రిజ్లాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here