ధాన్యం సేక‌ర‌ణ స‌జావుగా జ‌రుగుతుంది – మంత్రి గంగుల‌

0
224
Spread the love

ధాన్యం సేక‌ర‌ణ స‌జావుగా జ‌రుగుతుంది – మంత్రి గంగుల‌


Toofan – రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేక‌ర‌ణ సజావుగా సాగుతుంద‌ని, రైతుల నుండి ఎలాంటి పిర్యాదులు లేవ‌న్నారు రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, ఈరోజు హైద‌రాబాద్ సివిల్ స‌ప్లైస్ భ‌వ‌న్లో మెద‌క్, సిద్దిపేట‌ జిల్లాల‌లో ధాన్యం సేక‌ర‌ణ‌పై మంగ‌ళ‌వారం ఉన్న‌త అధికారులతో మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు, త‌డిసిన ధాన్యంపై రైతులుఆందోళ‌న చెంద‌వద్ద‌ని, ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో సేక‌రించాల‌ని ఆదేశాలు ఇచ్చామ‌న్నారు మంత్రి. రైతులు పుకార్ల‌ను న‌మ్మెద్ద‌ని క‌రోనా లాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ గ‌తంలో 92.45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల్ని సేక‌రించామ‌ని, ప్ర‌స్థుతం సైతం కేంద్రం మోకాల‌డ్డినా గౌర‌వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక‌ల్పంతో ధాన్యం సేక‌ర‌ణ స‌జావుగా చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం నుండి ఒక్క గ‌న్నీ బ్యాగు రాకున్నా అద‌నంగా స‌మ‌కూర్చుకొని సేక‌ర‌ణ చేస్తున్నామ‌న్నారు, ట్రాన్ప్ పోర్టేష‌న్లో కూడా ఎలాంటి ఇబ్బందులు

లేవ‌న్నారు, రైస్ మిల్ల‌ర్లు కూడా ప్ర‌భుత్వంలో స్టేక్ హోల్డ‌ర్ల‌ని అలాగే స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు, రైతులు నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకం అనంత‌రం ఒక్క గింజ కూడా త‌రుగు పెట్టొద్ద‌ని, అలాంటి సంఘ‌ట‌న‌ల్ని ఉపేక్షించ‌మ‌న్నారు, ఇప్ప‌టివర‌కూ రైతుల నుండి ఎలాంటి పిర్యాదులు లేవ‌ని, రాజ‌కీయ నిరుద్యోగులే అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వారికి కొంత‌మంది వంత‌పాడుతున్నార‌న్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్.
నిన్న‌టివ‌ర‌కూ రాష్ట్ర వ్యాప్తంగా 6257 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నామ‌ని, 204 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్త‌య్యాయ‌ని, 2,87,000 రైతుల‌నుండి 3634 కోట్ల విలువ గ‌ల 19 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల్ని కొన్నామ‌న్నారు మంత్రి గంగుల‌. మెద‌క్ జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాల‌కు గానూ 335 కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించామ‌ని, 14,561 మంది రైతుల నుండి 190 కోట్ల విలువ‌గ‌ల 1ల‌క్ష‌ మెట్రిక్ ట‌న్నుల్ని సేక‌రించామ‌ని ఇందుకోసం 25ల‌క్ష‌ల‌ గ‌న్నీల్ని వాడామ‌ని ఇంకా జిల్లాలో 16 ల‌క్ష‌ల‌ గ‌న్నీలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. సిద్దిపేట‌ జిల్లాలో 413 కొనుగోలు కేంద్రాల‌కు గానూ మొత్తం కేంద్రాల్ని ప్రారంభించామ‌ని, 11,485 మంది రైతుల నుండి 112 కోట్ల విలువ‌గల 57వేల‌ మెట్రిక్ ట‌న్నుల్ని సేక‌రించామ‌ని ఇందుకోసం 15ల‌క్ష‌ల‌ గ‌న్నీల్ని వాడామ‌ని ఇంకా జిల్లాలో 53ల‌క్ష‌ల‌ గ‌న్నీలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌నర్ అనిల్ కుమార్, మెద‌క్ క‌లెక్ట‌ర్ హ‌రీష్, మెద‌క్, సిద్దిపేట అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ, సంస్థ ఉన్న‌తాధికారులు మరియు సంభందిత స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here