చీము నెత్తురు ఉంటే బిజెపీ నేతలు ఢిల్లీ పోయి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తేవాలి

0
116
Spread the love
చీము నెత్తురు ఉంటే బిజెపీ నేతలు ఢిల్లీ పోయి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తేవాలి
 
తెలంగాణ‌కు అమిత్ షా ఎందుకు వచ్చారు, మోడీ ఎందుకు వస్తున్నారు.. ఏం ఇచ్చారు, ఏం చేశారు
 
మంత్రి హ‌రీష్ రావు ఘాటైన వ్యాఖ్య‌లు
 
విభజన హామీలు 8 ఏళ్లు అయినా నెరవేర్చలేదు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. చీము నెత్తురు ఉంటే బిజెపీ నేతలు ఢిల్లీ పోయి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తేవాలి. అని మంత్రి హ‌రీష్ రావు ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.  నారాయణ్ పేట్ జిల్లా  రూ. 56 కోట్లతో 390 పడకల ఆసుపత్రికి, రు. 1.25 కోట్లతో టి డయాగ్నొస్టిక్ నిర్మాణాలకు శంకుస్ధాపన, రూ. 5.98 కోట్లతో ఎర్రగుట్ట నుండి ఎక్లాస్ మీదుగా తెలంగాణ – కర్ణాటక సరిహద్దు వరకు నిర్మించిన 5.5 కిలోమీటర్ల రోడ్డును, డయాలసిస్ యూనిట్ ని ప్రారంభించారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్  గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన తదితరులు పాల్గొన్నారు. 
 
 

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…”390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్ధాపన చేసుకోవడం శుభ దినం. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఇది సాధ్యమైంది. అని అన్నారు. ఇక్క‌డ నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ ఇక్కడి నుండి మంత్రులుగా ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఎవరు తేలేదు. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే మొత్తం 4 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతున్నది. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ గారు 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. నారాయణ్ పేటలో మెడికల్ కాలేజ్ వస్తుంది. మీ కోరిక మేరకు నారాయణ్ పెట్ లో ఈ విద్యా సంవత్సరంలోనే నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం.” అని మంత్రి హ‌రీష్ రావు ప్ర‌క‌టించారు. “ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసే టి డయాగ్నొస్టిక్ సెంటర్ ని ప్రారంభించాము. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, టు డి ఏకో సేవలు కూడా ఇక్కడ అందుతాయి. అని వివ‌రించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నారు మీకు బాగా తెల్సు. అక్కడ రైతులకు 6 గంటల కరెంట్ ఉందా. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుంది. బిజెపి పాలన రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు. బిజెపి ఫెయిల్, టిఆర్ ఎస్ పాస్ అయినట్టే కదా” అని ప్ర‌శ్నించారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు అవుతుంది. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నము.” అని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here