గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

0
130
Spread the love

గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

కరీంనగర్లో ట్రెస్మా భవనానికి 10గుంటలు 50 లక్షలు కేటాయించాం

కరోనా సంక్షోభంలో ప్రైవేట్ టీచర్లకు సాయం అందించాం

కేసీఆర్ సర్కారు ఉపాధ్యాయులకు నిరంతరం అండగా ఉంటుంది

హుజురాబాద్ ట్రెస్మా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్

నిరంతరం ఉపాధ్యాయులకు అండగా ఉండే ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారిది అన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, హజురాబాద్ సిటీ సెంటర్లో ట్రెస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురూపూజోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు గారితో కలిసి హాజరయ్యారు గంగుల. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో ఇబ్బందులు పడ్డ ప్రైవేట్ అద్యాపకులకు దేశంలో ఎక్కడాలేనివిదంగా నెలకు 2వేలతో పాటు 25 కిలోల సన్నభియ్యం ఇచ్చి మానవతా ద్రుక్ఫథంతో సీఎం కేసీఆర్ గారు ఆదుకున్నారని గుర్తుచేశారు. చాలారోజులుగా మూసిఉన్న స్కూళ్లను సైతం ప్రారంబించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కరీనంగర్ ట్రెస్మా కార్యవర్గానికి నిరంతరం అండగా ఉంటామని, ఇప్పటికే కరీంనగర్ టౌన్లో అత్యంత విలువైన 10గుంటల భూమిని భవన నిర్మాణం కోసం ట్రెస్మాకు కేటాయించడమే కాక యాబై లక్షలు ఇస్తామని హామీనిచ్చామని, భూమిపూజ జరుపుకున్న ఆ భవన నిర్మాణం ప్రారంబించగానే నిధుల్ని అందజేస్తామన్నారు. సమాజాన్ని ప్రగతి బాటలో నడుపుతూ దేశానికి, ప్రపంచానికి ఉత్తమ నైపుణ్యాలు, మేదోశక్తిగల పౌరుల్ని అందించిన ఉపాద్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి గంగుల.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సంజీవరెడ్డి, రాష్ట్ర ట్రెస్మా అధ్యక్షుడు శేఖర్ రావు, ట్రెస్మా సభ్యులు, ఉపాద్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here