ప్ర‌త్యేక హ‌రిత హారం కార్య‌క్రమాన్ని విజ‌య‌వంతం చేయాలి

0
104
Spread the love

ఈ నెల 21న ప్ర‌త్యేక హ‌రిత హారం కార్య‌క్రమాన్ని విజ‌య‌వంతం చేయాలి

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌జ‌లు భాగ‌స్వాముల‌వ్వాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 19ః స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల ద్వి స‌ప్తాహ వేడుల్లో భాగంగా ఈ నెల 21న చేప‌ట్టిన ప్ర‌త్యేక హ‌రిత హారం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వ‌తం చేయాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌జ‌లు భాగ‌స్వాముల‌వ్వాలని మంత్రి కోరారు. ప్ర‌పంచంలో వినూత్నంగా చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మం స‌త్ఫాలితాల‌నిస్తున్న‌ది. రాష్ట్రంలో గ్రీన‌రీ 7.7శాతం పెరిగిందని, కోట్లాది మొక్క‌లు నాటిన ఫ‌లితంగా ప‌ర్యావ‌ర‌ణం కూడా ప‌రిర‌క్షించ‌బ‌డి వ‌ర్షాలు స‌మ‌యానుకూలంగా బాగా కురుస్తున్నాయ‌ని మంత్రి తెలిపారు. ఈ నేప‌థ్యంలో స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల ద్వి స‌ప్తాహ వేడుక‌లు రావ‌డం, ఈ అద్భుత అవ‌కాశాన్ని తీసుకుని, ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం ఒక మొక్క‌ను నాటి, వాటిని సంర‌క్షించాల‌ని మంత్రి కోరారు. ఇందుకు త‌గ్గ‌ట్లుగా జిల్లా క‌లెక్ట‌ర్లు, హెచ్ ఎం డిఎ, జిహెచ్ ఎం సి, ఇత‌ర శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here