కడెం ప్రాజెక్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

0
131
Spread the love

కడెం ప్రాజెక్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ప్రాజెక్టుకు ప్రమాదకర స్థితిలో వరదనీరుచేరుకుంటుంది..జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కడెం పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామ‌ని చెప్పారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఎగువ ప్రాంతంలో ఇటు ఎస్సారెస్పీ నుంచి అటు బోథ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అలాగే సీఎస్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ ఉన్నతాజా పరిస్థితిని వివరిస్తున్నారు.
ప్రస్తుతం వర్షాలు తగ్గితేనే వరద నీటి ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికైతే కొద్దిగా వరద నీటి ప్రవాహం తగ్గింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం అని మీడియాకు చెప్పారు మంత్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here